అందులో చేయమని అడిగారు.. కానీ, భర్తతో వివాదం కారణంగా..

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. మంచి పేరును తెచ్చుకుంది అమలా పాల్. అయితే, ఆమె చేసిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో టాలీవుడ్‌కు తాత్కాలికంగా బైబై చెప్పేసింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర భాషల్లో నటిస్తోంది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'ఆమె'. తమిళంలో 'అడై' పేరుతో వస్తున్న ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఇందులో అమలా పాల్ నగ్నంగా నటించడం సంచలనంగా మారింది. దీంతో ఈ సినిమాపై రెండు భాషల్లో అంచనాలు పెరిగిపోయాయి.

సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కోసం అమలా పాల్ హైదరాబాద్‌లో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన అంశాలను వెల్లడించడంతో పాటు తన వ్యక్తిగత విషయాలనూ పంచుకుంది. ఇందులో భాగంగానే గతంలో తాను ఓ భారీ సినిమాను వదులుకున్నానని, దానికి కుటుంబ వివాదాలే కారణమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Amala Paul Reject Mahanati

ఓ చానెల్‌తో మాట్లాడుతూ.. ''తెలుగులో తనదైన శైలితో నటించి ఎంతో గుర్తింపును తెచ్చుకున్న నటి సావిత్రి. ఆమె బయోపిక్ మూవీ 'మహానటి' కోసం మొదట నన్నే అడిగారు. ఈ సినిమా కోసం చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ నాతో సంప్రదింపులు కూడా జరిపారు. అయితే, అప్పుడు కుటుంబ వివాదాలతో నేను ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణంగా సినిమా చేయలేనని చెప్పాను. దీంతో నా స్థానంలో కీర్తీ సురేష్‌ను తీసుకున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

అమలా పాల్ నటించిన 'ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X