మాజీ భర్త రెండో వివాహంపై అమలాపాల్ రియాక్షన్.. విజయ్ క్యారెక్టర్ పై కామెంట్స్

అమలా పాల్ మాజీ భర్త, తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్ ఇటీవలే రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డాక్టర్ ఆర్ ఐశ్వర్య అనే యువతిని ఎఎల్ విజయ్ వివాహమాడారు. ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండగా తాజాగా ఈ ఇష్యుూపై అమలాపాల్ స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన భర్త రెండో వివాహం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది అమలాపాల్. ఇంతకీ ఆమె ఎలా రియాక్ట్ అయ్యింది. వివరాల్లోకి పోతే..

అమలాపాల్‌తో ప్రేమ.. రెండేళ్లకే బ్రేకప్

అమలాపాల్‌తో ప్రేమ.. రెండేళ్లకే బ్రేకప్

హీరోయిన్ అమలాపాల్‌ను ప్రేమించిన విజయ్.. 2014 సంవత్సరంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల పాటు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితానికి 2017లో బ్రేక్ పడింది. మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సింగల్ గా ఉన్న ఆయన ఇటీవలే మరో వివాహం చేసుకున్నారు.

 పెద్దల సమక్షంలో డాక్టర్‌తో రెండో పెళ్లి

పెద్దల సమక్షంలో డాక్టర్‌తో రెండో పెళ్లి

అమలాపాల్‌ తో విడిపోయిన అనంతరం రీసెంట్‌గా డాక్టర్ ఆర్ ఐశ్వర్య అనే యువతిని పెద్దల సమక్షంలో పెళ్లాడారు విజయ్. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే మీడియాకు వెల్లడించిన ఆయన.. తన జీవితంలోకి మరో వ్యక్తి వస్తోంది. జులైలో పెళ్లి చేసుకుంటున్నాం అని ప్రకటించారు. అన్నట్లుగానే విజయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిపై అమలాపాల్ స్పందన ఎలా ఉంటుందని ఆసక్తిగా ఎదురు చూశారు జనం.

అమలాపాల్ ఆసక్తికర స్పందన

అమలాపాల్ ఆసక్తికర స్పందన

విజయ్‌ రెండో పెళ్లి విషయమై అమలాపాల్ ఆసక్తికరంగా రియాక్ట్ అయింది. తన మాజీ భర్త విజయ్ చాలా స్వీట్‌ పర్సన్‌ అని, అతని జీవితం బాగుండాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. విజయ్- ఐశ్వర్య దంపతులకు చాలా మంది పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తున్నట్లుగా అమలాపాల్ తెలిపింది. తాను విజయ్ తో విడాకులు తీసుకున్నాక అవ‌కాశాలు రావని భయ పడ్డానని, కానీ టాలెంట్ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదని తెలిసిందని చెప్పింది అమలాపాల్.

అమలా పాల్ 'ఆమె'

అమలా పాల్ 'ఆమె'

అమలా పాల్ ప్రెసెంట్ మూవీ 'ఆమె'. ఈ మూవీలోని కొన్ని సీన్లలో ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది అమల. తమిళ చిత్రం 'మయాతా మాన్' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా 'వి స్టూడియోస్' సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. జులై 19న ఈ మూవీని వరల్డ్ వైడ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X