మరెందులోనూ నటించకూడదు: అమలా పాల్‌కు షాక్!
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్‌కు ఎర్నాకులం అడిషనల్ అండ్ సెషన్స్ కోర్టు షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఒప్పందం చేసుకున్నసంస్థకు తప్ప ఇతర జ్యువెల్లరీ యాడ్స్ ఏమీ చేయకూడదు అని నోటీసులు జారీ చేసింది. కొచ్చీకి చెందిన ఓ జ్యూయలరీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విషయంలో అమలాకు కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
మే 2014న రూ. 30 లక్షలు చెల్లించి తమ సంస్థ తరఫున ప్రచారకర్తగా కాంట్రాక్టు అగ్రిమెంటు కుదుర్చుకున్నామని, అగ్రిమెంటు ప్రచారం తమతో కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు ఇతర సంస్థలకు సంబంధించిన యాడ్స్ చేయకూడదని, కానీ కాంట్రాక్టును ధిక్కరించి మరో సంస్థకు ప్రచారం చేయడానికి, ఆ సంస్థ యాడ్ ఫిల్మ్ లో నటించడానికి అమల పాల్ సిద్ధమవుతోందని....సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నోటీసులు జారీ చేసింది.

అమల పాల్ సినిమాల విషయానికొస్తే....పెళ్లి తర్వాత ఆమె మలయాళ చిత్రం ‘మిల్లీ'తో వెండితెరపై సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించబోతుంది. రాజేష్ పిళ్లై దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమలాపాల్ డీగ్లామర్ పాత్రను పోషించనుంది. పాత్రలో సహజత్వం కోసం మేకప్ లేకుండా ఈ చిత్రంలో నటించబోతోంది.
సినిమా కథాంశం విషయానికొస్తే....అందవిహీనంగా ఉన్నాననే భావనతో అసంతృప్తికరమైన జీవనాన్ని కొనసాగిస్తున్న ఓ మధ్యతరగతి యువతి ఎలా అందాలరాణిగా మారింది? తన జీవితాన్ని ఏ విధంగా ఆనందమయం చేసుకుంది? అనేది మెయిన్ స్టోరీ. ఇందులో ఆమెు పాత్ర విభిన్నంగా, ఆదర్శవంతంగా ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











