Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదే నా ఫస్ట్ క్రష్ : అమలా పాల్
హైదరాబాద్ : చిన్నప్పుడు ఓ కుర్రాడికి ఆకర్షితురాలినయ్యేదాన్ని. దాన్నే ఫస్ట్‌క్రష్ అనుకోవచ్చు. మా అన్నయ్య స్నేహితుడు ఒకడుండేవాడు... మాంచి హైటు. మంచి డ్రెస్సులు కూడా వేసుకునేవాడు. ఆ అబ్బాయి అంటే ఇష్టమో ఏదో అనిపించేది అంటూ తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది అమలా పాల్.
ఇక హీరోయిన్ అయ్యాక ఎంతోమంది నన్ను అభిమానిస్తున్నారు. విదేశాలకు వెళ్లినా కూడా ఆటోగ్రాఫ్ కావాలంటూ చాలామంది పలకరిస్తుంటారు. కానీ, ఒక అభిమాని ఉన్నాడు... అతడిది ఏ వూరో తెలియదుగానీ ఏకంగా నాకోసం ఓసారి అమెరికా వచ్చేశాడు. ఆ విషయం అతడు చెబితే ఆశ్చర్యమేసింది. ఒక ఫొటో తీయించుకుని వెళ్లిపోయాడు అంది.
ఇప్పుడు మనుషులంటే భయం వేస్తోంది... నిజంగానే... ఎంతమంది జనంలో ఉన్నా కొంతమంది అదోలా నన్ను చూస్తుంటారు. చూపులతోనే తినేస్తామన్నట్టు ప్రవర్తిస్తుంటారు. అలాంటివారంటే చాలా భయం. నా ఎదురుగా ఉన్న వ్యక్తి కాస్త తేడాగా చూస్తున్నాడు అని తెలియగానే... అక్కణ్నుంచి వెళ్లిపోతాను అంటోంది అమలా పాల్.
ఇక దర్శకుడుగా యశ్‌చోప్రా అంటే చాలా గౌరవం. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ చూశాను. ఆయన దర్శకత్వంలో నటించాలని ఓ కల ఉండేది. యశ్‌జీ మరణించారని తెలిసి చాలా బాధపడ్డాను అంటూ చెప్తున్న అమల..తాజాగా పూరీ దర్శకత్వంలో ఇద్దరమ్మాయిల తో చిత్రం చేస్తోంది.
ఇద్దరమ్మాయిలతో' సినిమా కోసం అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తోంది. తన సినీ ప్రయాణం అనుకొన్నదానికంటే గొప్పగా ఉందని అంటోంది. మంచి వ్యక్తులతో పనిచేసే అవకాశం వస్తోంది. తెలుగులో తొలి అడుగులు వేస్తున్న దశలోనే రామ్‌చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అని మురసిపోతూ చెప్పింది.