పెళ్లి వేళ లొల్లి: తెలుగు దర్శకుడిపై అమలా పాల్ ఫైర్
హైదరాబాద్: హీరోయిన్ అమలా పాల్ జూన్ 12న తమిళ దర్శకుడు ఎఎల్.విజయ్‌తో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. గతం కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. చెన్నైలో వీరి వివాహం జరుగబోతోంది.
అయితే అమలా పాల్ పెళ్లికి సిద్ధమవ్వడంతో....ఆమెతో సినిమాలు కమిటైన కొందరు తెలుగు దర్శకులు గుర్రుగా ఉన్నారు. తాను దర్శకత్వం వహించబోయే 'వస్తా నీ వెనక' చిత్రంలో అమలా పాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్న దర్శకుడు రమేష్ వర్మ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. ఆమెను తీసేని మరొకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నాడు.

అయితే దర్శకుడు తనను తప్పు బట్టడంపై అమలా పాల్ మండి పడుతోంది. సినిమా కోసం తనను జనవరి నెలలో సంప్రదించారని, 45 రోజు బల్క్ డేట్స్ ఇచ్చానని, మార్చిలో షూటింగ్ మొదలు పెడతామని చెప్పి ఇప్పటి వరకు షూటింగ్ డేట్ ఖరారు చేయలేదు. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదు. అందుకే పెళ్లికి రెడీ అవుతున్నాను అని అమలా పాల్ తెలిపింది.
అమలా పాల్‌ను ప్రాజెక్టు నుండి తీసేస్తున్న దర్శక నిర్మాతలు....ఆమె నుండి ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి తాను ఇచ్చిన డేట్స్ వాడుకోకుండా తిరిగి డబ్బులు ఇవ్వమంటున్న దర్శకనిర్మాతల డిమాండ్‌కు అమలా పాల్ లొంగుతుందా? డబ్బు ఇచ్చేది లేదని వాళ్లతో వాదిస్తుందా? అనేది త్వరలో తేలనుంది.


Click it and Unblock the Notifications











