Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ నగ్న వీడియోకు భారీ స్పందన.. రికార్డులు బద్దలు కొడుతున్న హీరోయిన్ సినిమా
Recommended Video
అమలా పాల్.. కొద్దిరోజులుగా ఈ పేరు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. భారతదేశంలో ఎక్కడ చూసిన ఈమె గురించే మాట్లాడుకున్నారు. దీనికి కారణం ఇటీవల అమలా పాల్ నటించిన 'అడై' చిత్రమే. ఈ సినిమాతోనే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది. ఇందులో నగ్నంగా నటించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. వాస్తవానికి టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అందరిలో ఆసక్తి కనిపించింది. దీంతో 'అడై'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అమలా పాల్ సినిమా కొద్దిరోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

మిశ్రమ స్పందన
రెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ సినిమా బాగుందని చెప్పగా.. మరికొందరు మాత్రం ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసే అవకాశాలు లేవని అన్నారు. అయితే, తమ టార్గెట్ అయిన యువతకు సినిమా బాగా రీచ్ అయిపోయిందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.

విమర్శకుల ప్రశంసలు
‘అడై' విడుదలైన సమయంలో ఈ సినిమాను నగ్నత్వంతో కాకుండా మెచ్యూరిటీతో చూడాలని చాలా మంది పిలుపునిచ్చారు. ఇందులో అమలా పాల్ చేసిన ధైర్యాన్ని పలువురు సినీ విమర్శకులు కొనియాడారు. ప్రస్తుతం చెడు దారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించేందుకు అవసరమైన మెసేజ్‌ను ఈ సినిమా ద్వారా ఇచ్చారని ప్రశంసించారు.

అక్కడ కూడా సెన్సేషనే
‘అడై'/‘ఆమె' ఇటీవల ప్రముఖ డిజిటల్ దిగ్గజం ‘అమేజాన్ ప్రైమ్'లో విడుదలైంది. అక్కడ కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఏ సినిమాకూ రాని రీతిలో దీనికి క్లిక్స్ వస్తున్నాయని తెలుస్తోంది. బడా హీరోల సినిమాలకు సైతం రాని స్పందన దీనికి వస్తుందని సమాచారం. దీనికి కారణం ఇందులో అమలా పాల్ న్యూడ్ సీన్ ఉండడమేనని అంటున్నారు.

అడై గురించి..
అమలా పాల్ నటించిన ‘అడై'/‘ఆమె'.. యువత మరీ ముఖ్యంగా అమ్మాయిలు దారి తప్పితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయి అనే కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్రానికి రత్న కుమార్ దర్శకత్వం వహించగా.. వీ స్టూడియోస్ నిర్మించింది. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ‘ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది.

ఆ సినిమాకు కూడా..
ఇటీవల ‘డియర్ కామ్రేడ్' అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో క్లిక్స్ వస్తున్నాయి. గతంలో ఏ సినిమాకూ రాని స్థాయిలో ‘డియర్ కామ్రేడ్' కుమ్మేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారని తెలుస్తోంది. దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని సమాచారం.