స్టార్ హీరోయిన్ తండ్రి మృతి.. సంతాపం వ్యక్తం చేస్తున్న సినీ ప్రముఖులు

Recommended Video

Actress Amala Paul Father passed Away | Paul Vargheese | Amala Paul

స్టార్ హీరోయిన్ అమలాపాల్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి వర్గీస్ పాల్ హఠాన్మరణంతో సినీ వర్గాల్లో విషాదఛాయలు నెలకొన్నాయి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వర్గీస్ పాల్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు.

హుటాహుటిన చెన్నై బయల్దేరిన అమలాపాల్

హుటాహుటిన చెన్నై బయల్దేరిన అమలాపాల్

61 ఏళ్ల వయుసున్న ఆయన కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తండ్రి వర్గీస్ పాల్ మరణవార్త తెలుసుకున్న అమలాపాల్ కన్నీటి పర్యంతమైంది. ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆమె హుటాహుటిన చెన్నై నుంచి కేరళ బయల్దేరి వెళ్ళింది.

కోలీవుడ్‌లో విషాద ఛాయలు.. అంత్యక్రియలు

కోలీవుడ్‌లో విషాద ఛాయలు.. అంత్యక్రియలు

అమలా పాల్ తండ్రి మరణ వార్తతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయంత్రం కురుప్పంపాడులో పాల్ వర్గీస్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమలాపాల్ కెరీర్

అమలాపాల్ కెరీర్

'బెజవాడ' సినిమాతో టాలీవుడ్‌లో అమలాపాల్ ఎంట్రీ ఇచ్చింది. రామ్ చరణ్‌తో కలిసి 'నాయక్' సినిమాలో నటించి మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో కలసి చేసిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆమెకు స్టార్‌డమ్ తీసుకొచ్చింది.

అమలాపాల్ వైవాహిక జీవితం.. తండ్రి ఆందోళన

అమలాపాల్ వైవాహిక జీవితం.. తండ్రి ఆందోళన

కెరీర్ టాప్ లెవెల్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లాడింది అమలాపాల్. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆమె వైవాహిక జీవితం పట్ల తండ్రి పాల్ వర్గీస్ చాలా ఆందోళన చెందేవారని తెలిసింది.

ఇప్పుడిప్పుడే ఆమెకు వరుస అవకాశాలు

ఇప్పుడిప్పుడే ఆమెకు వరుస అవకాశాలు

ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళం, మలయాళ సినిమాలతో ఆమె బిజీగా ఉంటోంది అమలాపాల్. ఇటీవలే ఆమె సినిమాతో అలరించింది. ఇప్పుడిప్పుడే ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో తండ్రిని కోల్పోవడం బాధాకరం అంటున్నారు ప్రేక్షకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X