న్యూడ్ సీన్స్ గురించి అమ్మకు చెప్పగానే ఆమె రియాక్షన్.. అమలాపాల్

అమలా పాల్ తన తాజా చిత్రం ఆడై. తెలుగులో ఈ సినిమా 'ఆమె' పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జులై 19న ఈ సినిమా విడుదల కానున్న సందర్బంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమలా పాల్ పూర్తి నగ్నంగా నటించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అసలు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకేంది ఏంటి? ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా అమలా పాల్ నటించడానికి కథలో అంతబలమైన కారణం ఏముంది? అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తన నగ్న సన్నివేశాల గురించి మాట్లాడింది అమలాపాల్. ఈ మేరకు న్యూడ్ సీన్స్ విషయంలో తన తల్లి ఎలా రియాక్ట్ అయ్యిందో చెప్పింది. ఆడైలో ఉన్న న్యూడ్ సీన్స్ గురించి తన తల్లికి ముందే చెప్పానని, కథ డిమాండ్ చేస్తే అలా నటించడంలో తప్పు లేదని తన తల్లి చెప్పిందని ఈ సందర్బంగా అమలాపాల్ వెల్లడించింది.

Amala paul Says her mother reaction on Nude Seens

ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగుతుందని అనుకోవద్దని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమలాపాల్ పేర్కొంది. ఈ సినిమాలో నటించడం మూలంగా నిజ జీవితంలో కూడా ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని అమలాపాల్ చెప్పుకొచ్చింది. తాను ఆ న్యూడ్ సీన్ చేసేటపుడు డైరెక్టర్, కెమెరామెన్ సహా మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే షూటింగ్ స్పాట్ లో ఉన్నారని పేర్కొంది అమలాపాల్. వి స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X