Amala Paul Second Marriage: రెండోపెళ్లికి సిద్ధమైన అమలాపాల్..అతడి ప్రపోజల్ కు ఓకే చెబుతూ అడ్డంగా దొరికిపోయింది

అమలాపాల్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతశయోక్తి కాదు. బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 2013లో నాయక్ సినిమాలోనూ కనిపించింది. ఆ తర్వాత అదే ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి చిత్రాల్లోనూ కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈమె... అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంటుంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ తనకు సంబంధించిన ఓ స్పెషల్ విషయాన్ని అభిమానులతో పంచుకుంది.

Amala Paul Second Marriage With jagat Desai And Proposal Video Goes Viral

ఇన్ స్టాగ్రామ్ వేదికగా... ఓ అద్భుతమైన వీడియో షేర్ చేసింది అమలా పాల్. అందులో అమలా పాల్ తన స్నేహితులతో కలిసి పబ్బులో ఎంజాయ్ చేస్తుండగా.. ఆమె ముందుకు ఓ వ్యక్తి వచ్చాడు. పెళ్లి ప్రపోజల్ తో వచ్చి.. అమలా పాల్ ను ఆశ్చర్యపరిచాడు. అయితే అమలా పాల్ కూడా ఫుల్ సంతోషంగా అతడితో రెండో పెళ్లికి ఓకే చెప్పింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అలాగే ఇదే వీడియోని అమలా పాల్ కు ప్రపోజ్ చేసిన జగత్ దేశాయ్ కూడా ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. నా రాణితో ఒప్పుకుంది.. పెళ్లి భాజాలు మోగతాయి, హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ రాసుకొచ్చాడు.

Amala Paul Second Marriage With jagat Desai And Proposal Video Goes Viral

అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుసుకున్న ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరగా పెళ్లి చేసుకోండని సూచిస్తున్నారు. అలాగే కంగ్రాట్స్ చెబుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. వాట్ ఎ ప్రపోజల్ అంటూ కూడా పలువురు ఫ్యాన్స్ తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. అయితే ఈ జగత్ దేశాయ్ కు ఎలాంటి సినీ నేపథ్యం లేనట్లు తెలుస్తోంది. చుట్టాలు లేదా స్నేహితుల ద్వారా జగత్ అమలా పాల్ కు తెలిసి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. మరికొంత కాలం గడిస్తే తప్ప వీరి వీరి ప్రేమ కథ బయటకు వచ్చేలా లేదు.

ముందుగా అమలా పాల్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో ఘనంగా వీరిద్దరి వివాహం జరగ్గా.. అతి తక్కువ కాలానికే వీరిద్దరూ విడిపోయారు. మూడేళ్లకే వీరి మూడు ముళ్ల బంధం ముక్కలు అయింది. అయితే పెళ్లయ్యాక అమలా పాల్ సినిమాల్లో నటించకూడదని... అత్తమామలు కండీషన్లు పెట్టారట. ఇది భరించలేని అమలా పాల్ ఏఎల్ విజయ్ తో విడాకులు తీసుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే అప్పటి నుంచి ఈ క్యూట్ బ్యూటీ సింగిల్ గానే ఉంది. తాజాగా రెండోసారి పెళ్లి చేసుకోబోతుండడంతో అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X