డబ్బెవరికి చేదు : పెళ్లి అంటూనే కొత్త సినిమా సైన్ చేసింది
హైదరాబాద్ : అమలాపాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే . దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ని ఆమె వివాహమాడబోతోంది. అయినా ఆమె సినిమాల కమిటవటం మానలేదు. తాజాగా ఆమె ఓకే చేసిన ఓ మళయాళ చిత్రం ప్రారంభం జరిగింది. రాజేష్ పిళ్ళై డైరక్ట్ చేసే ఈ చిత్రంలో ఆమె వివాహం కు ముందు షూటింగ్ పూర్తి చేస్తుందా లేక తర్వాత షూటింగ్ పెట్టుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అమలా పాల్ మాట్లాడుతూ... పెళ్లి తర్వాత కూడా నటిస్తాను. దీనికి విజయ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా లభించింది. సినిమాతో నా అనుబంధం ఎప్పటికీ విడదీయలేనిది. సినిమా లేని నా జీవితాన్ని వూహించలేను. ఒక వ్యక్తిగా నన్ను నేను ఉన్నతంగా తీర్చిదిద్దుకొన్నానంటే కారణం ఈ పరిశ్రమే. కెమెరా ముందుకొచ్చిన కొత్తలో నాకు నిజంగా ఏమీ తెలిసేది కాదు. సినిమానే జీవితాన్ని నేర్పించింది అంది.
అలాగే... నేను విన్న కథలు, కలిసిన మనుషులు, చిత్రీకరణలో ఎదురైన అనుభవాలు అన్నీ కొత్త పాఠాలు నేర్పాయి. కష్టం అంటే ఏమిటో తెలిసేలా చేశాయి. చివరికి నాకు తోడును కూడా సినిమానే తీసుకొచ్చింది. ఇంత చేసిన సినిమా పరిశ్రమను ఎలా మరవగలను?'' అని చెప్పుకొచ్చింది అమలాపాల్. త్వరలో ఆమె 'జెండాపై కపిరాజు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమల ప్రస్తుతం మలయాళం ఒకటి, తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది.

మరో ప్రక్క అమాలాపాల్ వివాహం ఇప్పుడు ఆమెతో సినిమా కమిటైన వారిని ఇబ్బందుల్లో పడేసింది. వారు ఇప్పుడు ఆమెను తొలిగించి వేరే హీరోయిన్ ని తమ ప్రాజెక్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆమెను రెమ్యునేషన్ ని వెనక్కి ఇవ్వమని అడిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... హవీశ్ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్, కిరణ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా అమలాపాల్ ఎంపిక చేసారు.
అయితే ఆమెకు పెళ్లై పోతే తమ ప్రాజెక్టుకి సమస్య వస్తుందని భావిస్తున్నారు. వివాహిత నటించిందని తెలిస్తే..లవ్ స్టోరీ పండదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ పెళ్లి విషయం ముందే తమకు తెలిస్తే తాము జాగ్రత్తపడుదుమని వాపోతున్నట్లు తెలుస్తోంది. తాము అందరిలా తమ హీరోయిన్ వివాహం...అందరితో పాటు మీడియా ద్వారా తెలిసికోవాల్సి వచ్చిందని, ఇలా అమలాపాల్ తమకు దెబ్బకొట్టిందని, శ్రేయాభిలాషుల వద్ద నిర్మాతలు బాధపడినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











