బిజినెస్ లోకి దిగుతున్న అమలా పాల్

అమలా పాల్ మాట్లాడుతూ... ''ఎప్పట్నుంచో ఆ ఆలోచన ఉంది. ఏదో పక్కన ఓ వ్యాపారం ఉండాలి అన్నట్టు కాకుండా... ధ్యాసంతా దానిపైనే పెట్టి అభివృద్ధి చేయాలనుకొంటున్నా. అయితే ఏ వ్యాపారంలోకి వెళ్లాలన్నది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదు. 'ప్రేమఖైదీ' విడుదలయ్యాక స్నేహితులతో కలిసి ఓ చిన్న హోటల్‌ని ప్రారంభించే ప్రయత్నం చేశాను. కొన్ని కారణాలవల్ల చివరి దశలో ఆగిపోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం పక్కాగా అన్నీ సిద్ధం చేసుకొని అడుగేస్తా. నాకు స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి అన్నివిధాలా ప్రోత్సాహం లభిస్తోంది''అని చెప్పింది .
ఆమె తెలుగులో నటించిన 'జెండాపై కపిరాజు' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.
నాని మాట్లాడుతూ... గెలుపంటే అతడికి ఇష్టం. అయితే ఎదుటివాడిని ఓడించేందుకు ముందు తనపై తాను గెలవాలనుకొంటాడు. అదే సిసలైన విజయమని నమ్ముతాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అన్నారు. తాను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ఛాలెంజింగ్‌గా ఉంటుందని, చెడు మీద సాగించే యుద్దమే ఈచిత్రం..అందుకే 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ పెట్టినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











