twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్ని కోసం కత్తి తిప్పుతున్న అమలాపాల్(ఫోటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : అల్లు అర్జున్ తన తాజా చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' లో అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె కత్తి తో విన్యాసాలు చేయనుంది. ఈ మేరకు ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరుగుతోంది. ఒకేసారి రెండు కత్తులు పట్టుకుని ఆమె అదరకొట్టనుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కిచా(తుపాకి,బిల్లా 2, విశ్వరూపం ఫేమ్) ఈ ఫైట్స్ ని జనరంజకంగా తీస్తున్నారు.

    ఇక ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగానే రీసెంట్ గా దాదాపు అరవై కాస్ట్యూమ్స్ తో ఫోటో షూట్ చేసారు. అంతేగాక అతను ఈ ఫోటో షూట్ లో భాగంగా గిటార్ తో ఇచ్చిన ఫోజ్ కేక పెట్టించిందని సమాచారం. దాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా అల్లు అర్జున్ తో గిటార్ ఉంటుందని సమాచారం. హింది సినిమాల్లో షారూఖ్ ఖాన్ లాగ ఇందులో అల్లు అర్జున్ తన లవ్ స్టోరీతో,గిటార్ వాయించే పాటలతో అలరిస్తాడని చెప్పుకుంటున్నారు.

    ఇక 'జులాయి' సినిమాతో తన జోష్‌ చూపించారు అల్లు అర్జున్‌. ఆకతాయి కుర్రాడిగా బన్నీ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు ప్రేమికుడి అవతారం ఎత్తుతున్నారు. ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. ఆ సినిమానే 'ఇద్దరమ్మాయిలతో'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అల్లుఅర్జున్‌తో అమలాపాల్‌, కేథరిన్‌ ఆడిపాడనున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత.

    బ్యాంకాక్‌లో కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కిస్తారు. సింహభాగం విదేశాల్లోనే షూటింగ్‌ జరగనుంది. చాలాకాలం తరవాత పూరి తెరకెక్కిస్తున్న ప్రేమకథ ఇది. వినోదం, యాక్షన్‌ సన్నివేశాలకూ చోటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఓ పాటను సిద్ధం చేశారు.

    English summary
    Amala Paul who learnt Ninja fight for the film "Iddarammayilatho" looks damn sexy in this pose holding two swords. Amala Paul had a tough time shooting for some spine-chilling action sequences for her upcoming film Iddarammayilatho under the supervision of ace stunt choreographer Kicha (Thupaki, Billa 2 and Vishwarooopam fame).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X