అల్లు అర్జున్ హీరోయిన్ తల్లి అవుతోంది
హైదరాబాద్ : 'ఇద్దరమ్మాయిలతో', 'బెజవాడ', 'నాయక్' చిత్రాల హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియచేసింది. 'నాన్న', 'అన్న' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా ఏఎల్ విజయ్ పరిచయమే. వీరిద్దరి వివాహం జూన్ 12,2014 న గ్రాండ్ గా జరిగింది.
ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే... పెళ్లైన హీరోయిన్స్ కు సాధారణంగా ఆఫర్స్ తగ్గిపోతూంటాయి. హీరోలెవరు తమ సరసన తీసుకోవటానికి ఆసక్తి చూపరు. దాంతో కొంతకాలం గ్యాప్ తీసుకుని ఆంటి లుక్ తో అక్క, అమ్మ పాత్రలకు సిద్దమవుతూంటారు. ఇంకొంతమంది టీవిలకు వలస పోతూంటారు. ఈ విషయాలన్నీ ముందే పసిగట్టినట్లుంది అమలాపాల్.

ఎలాగూ వివాహానంతరం హీరోలు దగ్గరకు చేరనివ్వరని అర్దం చేసుకున్న ఆమె...సినిమాలు ఇక చెయ్యనని, అద్బుతమైన కథ వస్తే ఆలోచిస్తాను అంటోంది. అమలాపాల్ మాట్లాడుతూ.. ''కుటుంబానికే నా ప్రాధాన్యత ఉంటుంది. ఓ వేళ ఏదైనా అద్భుతమైన కథ లభిస్తే నటించటం గురించి అప్పుడు ఆలోచిస్తా.'' అని పేర్కొంది.
ప్రేమఖైదీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కోచ్చి సుందరి అమలాపాల్. ఆ చిత్రంలో ఓ గ్రామీణ యువతి పాత్రలో సహజసిద్ధంగా నటించి మెప్పించింది ఈ సుందరి. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్యతో ‘బెజవాడ'లో నటించే అవకాశం సైతం దక్కించుకుందీ భామ. ఇతర హీరోయిన్స్ మాదిరిగా గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న స్క్రిప్టులను ఎంపికచేసుకుని తెలివిగా ముందడుగేస్తోందీ సుందరి.
తొలిచిత్రంతోనే జాతీయ అవార్డ్ అందుకోవడమే గాకుండా ప్రతిష్ఠాత్మక ఫిలింఫేర్‌కు కూడా నామినేట్ అయ్యింది. ఇటీవల ‘దైవ తిరుమగల్'తో తమిళంలో విజయాన్ని నమోదుచేసుకుంది. అదే సినిమా తెలుగులో ‘నాన్న'గా విడుదలై ..ఇక్కడా గుర్తింపును పెంచింది. ఇద్దరమ్మాయిలతోనూ ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత చేసిన నాయిక్ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది.


Click it and Unblock the Notifications











