సింపుల్ గా అమలాపాల్ నిశ్చితార్థం (ఫొటోలు)
చెన్నై: దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌ల నిశ్చితార్థం శనివారం కోచ్చిలోని ఓ చర్చిలో వైభవంగా జరిగింది. కాబోయే వధూవరులు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకొన్నారు. తెల్లటి గౌనులో అమలాపాల్ మెరిసిపోయింది. పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.
ఈ నెల 12న చెన్నైలో మేయర్ రామనాథన్ చెట్టియార్ హాల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది. దీనికి సంబంధించి అప్పుడే చెన్నైలో ఏర్పాట్లు వేగిరం చేశారు. దక్షిణాది చిత్రపరిశ్రమకు సంబంధించిన పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు.
'మైనా' సుందరి అమలాపాల్, తమిళ దర్శకుడు విజయ్ ...ఇద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో ఎవరినీ నొప్పించకుండా క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఎంగేజ్‌మెంట్ చేసుకుని, హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.
స్లైడ్ షోలో ఫొటోలు...

రొమాంటిక్
విజయ్ గురించి నాకు మాత్రమే తెలిసిన విషయమేమిటంటే... తను రొమాంటిక్ పర్సన్. అలాగే తనది అరుదైన బ్లడ్ గ్రూప్. ఎవరైనా తన బ్లడ్ గ్రూప్‌వాళ్లు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే వెళ్లి రక్తదానం చేసొస్తాడు అంటోంది అమలా పాల్

రోల్ మోడల్
మా అమ్మానాన్నలకి విజయ్ గురించి బాగా తెలుసు. ఒక కొడుగ్గా, అల్లుడు, సోదరుడిగా వాళ్లకు తను ఓ రోల్‌మోడల్ అని చెప్పొచ్చు. విజయ్‌ని అడక్కుండా మా అమ్మానాన్నలు ఏ నిర్ణయం తీసుకోరు. బాధ్యతల విషయంలో విజయ్‌లా ఉండాలని మా తమ్ముడిని విసిగిస్తుంటారు కూడా అంటోంది అమలా పాల్

తర్వాతే...
అమలా పాల్ మాట్లాడుతూ... పెళ్లయ్యాక నేను ఏం చేయాలన్న నిర్ణయానికి విజయ్ నాకే వదిలేశాడు. నేను మళ్లీ నటిస్తానా లేదా? అన్న విషయం అప్పటి పరిస్థితులు నిర్ణయిస్తాయి. నాకు మాత్రం విజయ్, కుటుంబం తొలి ప్రాధాన్యం. ఆ తర్వాత మిగతా విషయాలు అంది

నిశ్చితార్దం, సంగీత్
కేరళలో నిశ్చితార్థం, సంగీత్ కార్యక్రమాలుంటాయి. లైవ్ బ్యాండ్, గుర్రపు బండీపై రావడంలాంటివి అందులో ఉంటాయి. నిశ్చితార్థంలో నేను ధరించే గౌన్‌ని ఢిల్లీ డిజైనర్ హిమంగి సిద్ధం చేస్తోంది. సంగీత్‌లో ధరించే దుస్తుల్ని అనిత డోగ్రే డిజైన్ చేస్తోంది.

చీరతో
చెన్నైలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుక జరుగుతుంది. అక్కడ కాంచీవరమ్ చీర కట్టుకొంటా. విందుకి నేను విజయ్ సవ్యసాచి డిజైన్ చేసిన దుస్తుల్ని ధరించబోతున్నాం.


Click it and Unblock the Notifications











