గ్రాండ్‌గా అమలా పాల్- డైరెక్టర్ విజయ్ వివాహం (ఫోటోలు)
చెన్నై: హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు ఎఎల్ విజయ్ వివాహ మహోత్సవం ఈ రోజు(జూన్ 12) చెన్నైలో వైభవంగా జరిగింది. చెన్నైలోని వల్లియమ్మాయ్ హాల్ ఎంఆర్‌సి సెంటర్లో ఈ వేడుక జరిగింది. అమలా పాల్ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కావడంతో ఇటీవల ఎంగేజ్మెంట్ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం కొచ్చిలోని చర్చిలో జరిగింది.
అయితే వివాహం మాత్రం పూర్తిగా హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ వివాహంలో అమలా పాల్ ముఖర్జీ డిజైన్ చేసిన కాంచీవరం చీరలో దర్శనమించ్చింది. వరుడు విజయ్ తమిళ సాంప్రదాయం ప్రకారం పంచెకట్టులో కనిపించారు. వీరి వివాహానికి అజిత్, విజయ్, విక్రమ్, జివి ప్రకాష్ కుమార్‌లతో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అమలా పాల్, విజయ్ వివాహ మహోత్సవానికి సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

తాళిక కట్టు శుభవేళ...
అమలా పాల్ మెడలో మూడు ముళ్లు వేసి తన అర్దాంగిని చేసుకుంటున్న ఏఎల్ విజయ్. ఈ ఇద్దరి జీవితంలో ఇది మరుపురాని క్షణం.

వివాహ మండపంలో అమలా పాల్-విజయ్
వివాహ మండపంలో కూర్చున్న హీరోయిన్ అమలా పాల్, దర్శకుడు విజయ్‌ని ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చూడొచ్చు.

జీవితాంతం తోడుంటానని...
వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి ఎఎల్ విజయ్, అమలా పాల్ ఏకమయ్యారు.

పెళ్లికి రెడీ అవుతూ...
పెళ్లి వేడుకకు రెడీ అవుతున్న అమలా పాల్. పెళ్లి ముందు మెహందీ పడుతుండగా తీసిన సినిమా ఇది.

విజయ్, జీవి ప్రకాష్ విత్ ఫ్రెండ్స్
పెళ్లి కుమారుడు ఎఎల్ విజయ్‌తో కలిసి జివి ప్రకాష్, ఇతర స్నేహితులు...

జివి ప్రకాష, విజయ్
తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాష్...దర్శకుడు విజయ్‌కి చాలా క్లోజ్. పెళ్లి ముందు వీరిద్దరూ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

పెళ్లికి ముందు...
పెళ్లికి కొన్ని గంటల ముందు అమలా పాల్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

వివాహం
తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్, హీరోయిన్ అమలా పాల్ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం వైభవంగా జరిగింది.


Click it and Unblock the Notifications











