'బెజవాడ' హీరోయిన్ మీడియాకు వార్నింగ్
బెజవాడ చిత్రంతో తెలుగులో పరిచయమవుతున్న హీరోయిన్ అమలా పౌల్. ఆమె రీసెంట్ గా మీడియాకు ఘాటుగానే వార్నింగ్ ఇచ్చింది. ఆమెకూ, నాన్న దర్శకుడు విజయ్ కూ రిలేషన్ ఉందంటూ వచ్చిన వార్తలపై ఆమె మండిపడింది. ఆమె మాట్లాడుతూ.. నా వ్యక్తిగత విషయాలు మీకెందుకూ అంటూ మీడియాను నిలదీసింది. దర్శకుడు విజయ్‌తో తానేదో ప్రేమకలాపాలు సాగిస్తున్నట్లు అప్పట్లో గాలి వార్తలు రాయడంపై అమలాపాల్ మండిపడింది. సినిమాల గురించి ఏమిరాసినా తాను పట్టించుకోననీ, అయితే వ్యక్తిగత విషయాల జోలికి వస్తే మాత్రం సహించేది లేదని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇకనైనా ఇటువంటి రూమర్స్ ని క్రియేట్ చేయటం మానుకోవాలని అంది. ఇక తెలుగులో బెజవాడతో తన క్రేజ్ ప్రారంభం అవుతుందని, వరసగా తను ఇక్కడ సినిమాలు చేస్తానని అంది.
దుర్గమ్మ-కృష్ణమ్మ ఉన్న బెజవాడ ప్రశాంతంగా ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో.. కోపంలో అంతటి ప్రళయం సృష్టిస్తుంది. ఇదే బేసిక్ లైన్. బెజవాడ ఎమోషన్‌తో ముడిపడిన కథ ఇది! టైటిలే ఓ పాత్ర. నాగచైతన్య హీరోయిజాన్ని ఆవిష్కరిస్తుంది. పక్కా కమర్షియల్ యాక్షన్ సినిమా ఇది అంటున్నారు దర్శకుడు వివేక్ కృష్ణ. అలాగే నాగచైతన్య పాత్ర గురించి చెపుతూ.. పద్ధతిగా ఉన్న వ్యవస్థను అనవసరంగా కెలికితే..అది ఓ భూకంపంగానో, సునామీగానో మారే ప్రమాదముందని చెబుతున్నాం.నాగచైతన్య ఆ వ్యవస్ధను కదిపే కుర్రాడుగా కనిపించనున్నాడు అన్నారు.ఇక విజయవాడ అంటే గ్రూపు రాజకీయం, గూండాయిజం ఉంటుంది. దేవినేని ఉమ, నెహ్రూ, వంగవీటి రంగా, రాధ.. ఇలా వర్గాలున్నాయి. అవన్నీ తెరపై చూపించటం లేదన్నారు.


Click it and Unblock the Notifications











