రవితేజతో అమలా పౌల్ ఖరారు
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన అందం, హాట్ పెర్ఫర్మెన్స్ తో అందరి మనసులు దోచేసిన అమలపాల్ త్వరలోనే మాస్ మహారాజ రవితేజతో రొమాన్స్ చేయనుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రంలో అమలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకోసం నయనతార, నిత్యామీనన్, త్రిషలతో పాటు....కన్నడ హీరోయిన్ పరూల్ యాదవ్ లను పరిశీలించినప్పటికీ చివరకు అమలపాల్ కన్ ఫర్మ్ అయినట్లు స్పష్టం అవుతోంది. అమల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఈ చిత్రానికి 'సారొస్తారా' అనే టైటిల్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఈ చిత్రలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బబ్లీగా ఉంటుంది. దానికి అమలా పాల్ అయితేనే సరిగా సరిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బేనర్‌పై రూపొందిస్తున్నారు. గతంలో యువత, సోలో చిత్రాలకు దర్శకత్వం వహించి సక్సెస్ అయిన పరశురాం అంతకంటే ముందు రవితేజతో'ఆంజనేయులు' చిత్రం రూపొంచాడు. అయితే ఆ చిత్రం ఫెయిల్ అయింది. ఈ సారి ఎలాగైనా రవితేజతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
ప్రస్తుతం రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం షూటింగులో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో రవితేజ సరసన ఇలియాన నటిస్తోంది. రవితేజ నటించిన 'దరువు' చిత్రం మే నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











