స్టార్ అయ్యుండీ హిజ్రాతో తిరిగే...అనుష్క హ్యాట్సాఫ్
అమలాపురం సరోజ పాత్ర సృష్టి వెనుక బాలగంగాధర తిలక్ కథ 'ఊరి చివరి ఇల్లు'లోని పాత్ర ప్రేరణ ఉంది. రావిశాస్త్రి ఆరు సారాయికథలు నుంచి పుట్టిన పాత్ర అమలాపురం సరోజ అంటున్నారు క్రిష్. ఆయన తాజా చిత్రం వేదంలోని వేశ్య పాత్ర అమలాపురం సరోజ. అనుష్క పోషించిన ఈ పాత్ర ఇవాళ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ చిన్న కడుపు నింపు కోవడానికి ఇంత చేయడం అవసరమా?..అని రియలైజ్ అయ్యే సీన్ లో ఆమె అమోఘంగా నటించింది అంటున్నారు. ఇక ఆమె పాత్ర గురించి క్రిష్ చెబుతూ....సమాజంలో చీదరింపుకు గురయ్యే వేశ్య..సరోజ పాత్ర. ఆ పాత్రని చేసిన అనుష్కకి హ్యాట్సాఫ్. నెంబర్‌వన్ స్టార్ అయివుండీ, ఎలాంటి భేషజాలు లేకుండా వేశ్య పాత్ర చేసింది. ఆ పాత్రని ఆమె పోషించిన తీరు అమోఘం. ఆమెకు హీరో ఉండడు. ఒక హిజ్రాను వెంటబెట్టుకొని తిరిగే వేశ్య పాత్ర. అంత గ్లామర్ ఇమేజ్ ఉన్న అమ్మాయి అయివుండి కూడా ఆ పాత్ర చేసింది అంటున్నారు క్రిష్. నిజమే కదా.


Click it and Unblock the Notifications











