twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమలాపురం సరోజ కూడా ఓ మనిషే: అనుష్క

    By Sindhu
    |

    'అరుంధతి" చిత్రంలో కామాంధుడి అంతు చూసే పాత్రలో నటించిన అనుష్క 'వేదం"లో అందుకు భిన్నమైన వేశ్య పాత్రలో నటించింది. వేశ్య పాత్ర అంటేనే పక్కకు పోయే నటీమణులున్న ఈ కాలంలో ఆ పాత్ర చేసేందుకు సాహసించారే..? అని అడిగితే...'నటి అన్నాక ఎటువంటి పాత్రనైనా చేయాలి. ఫలానా పాత్రలు మాత్రమే చేస్తానని అంటే నటి అని ఎలా అనిపించుకోగలరు. సమాజంలో భిన్నమైన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులకు ఉండే అన్ని పార్శ్వాలను తాకినప్పుడే పరిపూర్ణమైన నటి అనిపించుకోగలరు.

    నాకుమటుకు నేను ఈ భూమిపై మనుషులు ఎన్ని రకాలుగా ఉంటారో అన్ని రకాల పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నా అంటున్నది అనుష్క. అంతేకాదు కనిపించేందుకు నేను రెడీ. అటువంటి జీవమున్న కథతో వస్తే నేను ఎటువంటి పాత్రలోనైనా నటిస్తా...అది వేశ్యా...లేదా భిక్షగత్తా అని చూడను. నటన అన్నాక నటనే. అని కుండబద్ధలు కొట్టినట్లు చెపుతోంది అనుష్క.

    వేదం సినిమాలో అనుష్క పోషించిన వేశ్య పాత్ర 'అమలాపురం సరోజ" పేరు వివాదాస్సదమైన సంగతి తెలిందే. ఈ విషయం పై డైరక్టర్ క్రిష్ మాట్లాడుతూ 'ఊరిలో వేశ్యలు ఉండకూడదా..వేశ్య కూడా మనిషే. ఇలా వివాదం చేయడం వల్ల అమలాపురంకు చెందిన ఆడవారు ఫల్ అయ్యేటట్టు చేశారు. దయచేసి దీన్ని వదిలేయండే అన్నారు. మొదట కాకినాడ సరోజ అని పెట్టాలనుకొన్నాం అయితే నాకు ఇష్టమైన పేరు అమలాపురం అందుకే అలా పెట్టాను అని చెప్పుకొచ్చారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X