తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసిన ‘అమలాపురం సరోజ’....
వేశ్య క్యారెక్టర్లు చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎగబడిపోతూ ఉంటారు. కానీ దక్షిణాదిలో మాత్రం అలాంటి క్యారెక్టర్ చేసిన వారిని కూడా ప్రేక్షకులు 'క్యారెక్టర్ లెస్"గా జమ కట్టి కామెంట్ చేస్తారని చాలా మంది జంకుతుంటారు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాకా వైవిద్య భరితమైన ఎటువంటి క్యారెక్టర్స్ లోనైనా నటించాల్సిందే అని అంటుంటారు మరికొందరు హీరో హీరోయిన్స్. అదే కోవలో వెరైటీ క్యారెక్టరనుకుని, అభినయానికి ఆస్కారమున్న అవకాశమనుకుని ముచ్చటపడి, తక్కువ పారితోషికం తీసుకుని మరీ 'వేదం" లో 'అమలాపురం సరోజ" గా నటించిన అనుష్కనే అడిగితే ఆ పాత్ర చేయండ ఎంత తప్పయిందో వివరంగా చెబుతుంది.
వేదం" సినిమా వల్ల అనుష్కకి వచ్చిన ప్రయోజనం కంటే అది చేసిన నష్టమే ఎక్కువ. వేదం విడుదల కాక ముందు అనుష్క ఎక్కడ కనిపించినా అభిమానులు 'అరుధతి", 'బొమ్మాలీ" అని పిలుస్తుండేవారు. కానీ 'వేదం" రిలీజ్ తర్వాత తనని 'సరోజా.."అని వెకిలిగా పిలవడమే కాకుండా తనని ఉద్దేశించి చీప్ కామెంట్స్ కూడా పాస్ చేస్తుండడం అనుష్కని భాదిస్తోందని సినిమా సర్కిల్స్ టాక్. ఇటీవల జరిగిన స్టార్ క్రికెట్ మ్యాచ్ లో అనుష్క స్టేడియంలో కనిపించగానే కొందరు ఆకతాయిలు సరోజా అని పిలుస్తూ అనుష్కపై వల్గర్ కామెంట్స్ చేశారట. 'సరోజ" నటిగా తనకి హెల్పవుతుందని అనుకుంటే తనకున్న ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని అనుష్క లేట్ గా రియలైజ్ అయిందట. అందుకే తమిళ 'వేదం"లో నటించమని వెంటపడ్డా కూడా నిర్మొహమాటంగా నిరాకరించిందట.
ఇప్పటికీ శింబు, మనోజ్ కలిసి అనుష్కని ఒప్పించడానికి తమవంతు కషి చేస్తున్నా కానీ అనుష్క మాత్రం 'వేదం"లో ఒక్కసారి ఆ క్యారెక్టర్ చేసినందుకే బాగా బుద్దొచ్చిందని మరోసారి అలాంటి పాత్రల జోలికి పోనని నిక్కచ్చిగా చెప్తోందట. అయితే ఇలాంటివన్నీ నేను లెక్క చేయనని నమిత 'అమలాపురం సరోజ" క్యారెక్టర్ కి రెడీ అయిపోయిందని సమాచారం.


Click it and Unblock the Notifications











