»   » అభిమానుల కోసం బట్టలు విప్పేసింది కానీ....

అభిమానుల కోసం బట్టలు విప్పేసింది కానీ....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ ప్రేక్షకుల మదిని దోచే అందాల నటిగానే కాక, మంచి సింగర్ గానూ, ప్రెజెంటర్ గానూ పేరుతెచ్చుకున్న 'అమందా లూయిస్ హోల్డెన్ కి తన అభిమానుల చేతుల్లోనే ఘోర పరాభవం ఎదురయ్యింది. ఘోరావమానం అనగానే ఏదేదో ఊహించుకోకండి.

సింగర్ గానే కాక అందాల ఆరబోతలోనూ పేరు తెచ్చుకున్న అమందా ఒంటిమీద బట్టల్లేకుండా టూపీస్ బికినీతో ఉన్న ఫొటోని పోస్ట్ చేస్తే అది ఫొటోషాప్ తో చేసిన ఫొటో అని, నిజమైంది కాదనీ కొట్టి పారేస్తూ కామెంట్లు పెట్టారట. దీంతో తన మంచిమనసుని అర్థం చేసుకోలేని అభిమానుల పై చిన్న బుచ్చుకున్న ఈ అమ్మడు చిన్నబుచ్చుకుని వెంటనే ఆ ఫొటో డిలీట్ చేసేసింది .

ప్రస్తుతం లండన్ లో "బ్రిటన్ గాట్ టాలెంట్" అనే ఒక ప్రత్యేక షో ఫైనల్ ఈవెంట్ జరుగుతోంది. అందులో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న అమందా ఆ షోలో భాగంగా ఒక ఫొటో షూట్ లో పాల్గొంది.,,ఆ షూట్ ఆమె ఓ సముద్రం ఒడ్డున చెక్కతో చేసిన చిన్న వంతెనపై రెండే రెండు క్లాత్ పీస్ లతో బికీనీ వేసుకొని కెమెరాకు ఫోజిచ్చింది. అది కూడా వెనుక నుంచి.

Amanda Holden suffers "photoshop fail" with Instagram beach bum snap

ఈ ఫొటోను వెంటనే ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోను వేగంగా షేర్ చేసుకున్న అభిమానులు ఆ తర్వాత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ కళ్లను మోసం చేసేందుకు అమందా ప్రయత్నించారని, ఫొటో షాప్ సహాయంతో ఆమె తన ఫొటోను మార్చి పోస్ట్ చేశారని తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతే వొళ్ళు చూపించినా అవమానించిన అభిమానుల మీద వొళ్ళు మండిన అమందా ఆ ఫొటోలని తీసేసింది.

నట జీవితంలోనూ, సింగర్ గానూ, జడ్జిగానూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అమందా వివాహ జీవితం మాత్రం ఎన్నో మలుపులు తిరగడం, ఎన్నోసార్లు మోసపోవడం వల్ల ఆమె మరింత కోపంగా తయారయ్యిందని అంటారు. ఆమె సన్నిహితులు. 1995 లో "లెస్ డెన్నిస్" ను వివాహమాడిన అమందా .

Amanda Holden suffers "photoshop fail" with Instagram beach bum snap

ఎనిమిదేళ్ళ తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో 2003 లో విడిపోయారు. అనంతరం 2008 లో తిరిగి క్రిస్ హూగ్స్ ను పెళ్ళి చేసుకుంది. 44 ఏళ్ళ అమందాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం "బ్రిటన్ గాట్ ట్యాలెంట్" షో జడ్జింగ్ ప్యానెల్ లో సైమన్ తో పాటు... అమందా కూడా జడ్జిగా కొనసాగుతోంది.

English summary
Amanda Holden quickly deletes teasing bikini snap after fans claim it's Photoshopped
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu