రవితేజ సీక్రెట్ బయటపెట్టిన ఇలియానా.. కంగుతిన్న శ్రీనువైట్ల, మాస్ మహారాజా!
Recommended Video

అందాల భామ ఇలియానా చాలా గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంథోని చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రంలో గ్లామర్ డాల్ పాత్రను పోషించింది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రవితేజ, శ్రీనువైట్లతోపాటు ఇలియానా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ..

మాస్ మహారాజా రవితేజతో
చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్నాను. సినిమా కథ నచ్చడంతో ఈ పాత్రను అంగీకరించాను. రవితేజతో నటించడమంటే నాకు చాలా ఇష్టం. ఈ చిత్రం కోసం తొలిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పించాను. నాకు తెలుగు రాకపోయిన డబ్బింగ్ చెప్పడానికి కారణం శ్రీనువైట్లనే. ఆయన అందించిన సహకారం మరిచిపోలేనిది.

సిక్స్‌ప్యాక్‌తో మాస్ మహారాజా
అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో రవితేజ్ సిక్స్‌ప్యాక్‌లో కనిపిస్తారు అని ఇలియానా చెప్పగానే.. సీక్రెట్ చెప్పేసింది అన్నట్టు రవితేజ, శ్రీనువైట్ల ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. అయితే మాకు తెలియదు కాబట్టి దానిని పట్టించుకోవద్దు అని వేదికపై సుమ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

ఎస్ తమన్ మ్యూజిక్ అంటే
తమన్ ఇచ్చే పాటలు నాకు బాగా నచ్చుతాయి. గతంలో ఆయన అందించిన గో గో గోరే పాట నాకు ఇష్టం. ఇప్పుడు తమన్ తన సంగీతంతో రాకింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పాటలు కూడా నాకు బాగా నచ్చాయి అని ఇలియాన పేర్కొన్నారు.

వరుస ఫ్లాపుల అనంతరం
వరుస ఫ్లాపుల తర్వాత శ్రీనువైట్ల అందిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రం నవంబర్ 16న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పాత్రలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో మరింత ఆసక్తి పెరిగింది.


Click it and Unblock the Notifications











