For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమర్ అక్బర్ ఆంటోని ప్రీ రిలీజ్ రివ్యూ: రవితేజ, శ్రీనువైట్ల జాక్‌పాట్ కొట్టే..

|

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం నవంబర్ 16న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని వరుస విజయాలతో దూసుకెళ్తున్న మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించారు. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా అంచనాలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో సినిమాకు ఆకర్షణగా మారిన కొన్ని విషయాలు..

Amar Akbar Anthony Movie News Gets A Surprise News | Filmibeat Telugu
 హైలెట్‌గా రవితేజ ఎనర్టీ

హైలెట్‌గా రవితేజ ఎనర్టీ

అమర్ అక్బర్ ఆంటోని సినిమా విషయానికి వస్తే హీరో రవితేజ ఎనర్జీ హైలెట్ కానున్నది. టీజర్లు, ట్రైలర్లలో మాస్ మహారాజా చేసిన వినోద హంగామా ఆకట్టుకొంటున్నది. రవితేజ, శ్రీనువైట్ల మార్కు కామెడీ ప్రేక్షకులను సినిమాకు రప్పించే విధంగా మారింది.

మాస్ మహారాజా ట్రిపుల్ రోల్

మాస్ మహారాజా ట్రిపుల్ రోల్

మాస్ మహారాజా రవితేజ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. అమర్ అక్బర్ ఆంటోని పాత్రలతో హల్‌చల్ చేయనున్నాడు. క్లాస్ మాస్ అంశాలను మేలవించి ప్రేక్షకులను కనువిందు చేసే ప్రయత్నం చేశాడనే విషయం అర్ధమవుతుంది. శ్రీనువైట్లతో కాంబినేషన్ సినిమాకు మరో ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఇలియానా గ్లామర్

ఇలియానా గ్లామర్

అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ద్వారా ఇలియానా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నది. అత్యధిక పారితోషికం అందుకొనే సమయంలోనే బాలీవుడ్‌కు తరలి వెళ్లింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించింది. ఇలియానా గ్లామర్, నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ చెబుతున్నారు.

రూటు మార్చిన శ్రీనువైట్ల

రూటు మార్చిన శ్రీనువైట్ల

ఇక శ్రీనువైట్ల మూస ధోరణి మార్కును వదిలి సరికొత్త సబ్జెక్ట్‌తో అమర్ అక్బర్ ఆంటోనిని తెరకెక్కించినట్టు స్పష్టమవుతున్నది. కథ, కథనాల్లో వైవిధ్యం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం శ్రీను వైట్ల కెరీర్‌ను మలుపు తిప్పే అంశంగా మారింది. శ్రీను వైట్ల సక్సెస్ అందుకొంటాడా అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో పెరిగింది.

స్పెషల్ ఎట్రాక్షన్‌గా తమన్

స్పెషల్ ఎట్రాక్షన్‌గా తమన్

ఎస్ తమన్ అందిస్తున్న సంగీతం ఇటీవల కాలంలో డిఫెరెంట్ మార్కు కనిపిస్తున్నది. భాగమతి, అరవింద సమేత చిత్రాలకు అందించిన బీజీయం, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో డాన్ బాస్కో పాట ఇప్పటికే ప్రజాదరణ పొందింది. ఖుల్లం ఖుల్లా చిల్లా అనే పాట మాస్ బీట్‌తో సాగింది. కాల భైరవ పాడిన పాట గుప్పెట పాట కూడా విశేషంగా ఆకట్టుకొంటున్నది.

సునీల్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ

సునీల్, సత్య, వెన్నెల కిషోర్ కామెడీ

రవితేజ అందించే వినోదంతోపాటు సునీల్, సత్య, వెన్నెల కిషోర్ అందించే కామెడీ బోనస్‌గా చెప్పుకొంటున్నారు. ముఖ్యంగా సత్య చేసే కామెడీ నాకు బాగా నచ్చిందని స్వయంగా రవితేజ చెప్పడం గమనార్హం. వినోదం, మాస్ ఎలిమెంట్స్ తదితర అంశాలు అమర్ అక్బర్ ఆంటోనికి అదనపు ఆకర్షణగా మారితే సినిమా సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంది.

English summary
Amar Akbar Anthony is an film co-written and directed by Srinu Vaitla which features Ravi Teja and Ileana D'Cruz in the lead roles. The film is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and Mohan Cherukuri under their banner Mythri Movie Makers. Pre-production of the film began in June 2017, and the film's principal photography commenced at New York in April 2018. The film is scheduled for a worldwide release on November 16, 2018.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more