ట్విట్టర్ రివ్యూ : అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీనువైట్లకు హిట్ పడ్డట్లేనా!
Recommended Video

మాస్ మహారాజ రవితేజ, ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చితం అమర్ అక్బర్ ఆంటోని. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వెంకీ, దుబాయ్ శీను వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. శ్రీనువైట్ల ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. రవితేజకు కూడా హిట్ అవసరం. ఈ నేపథ్యంలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఈ సారి శ్రీనువైట్ల, రవితేజ మ్యాజిక్ పనిచేస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. పైగా నడుముసుందరి ఇలియానాకు ఇది రీఎంట్రీ మూవీ. ఇలాంటి అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకులముందుకు వస్తోంది. యూఎస్, ఇతర ప్రాంతాల్లో ప్రదర్శన మొదలైన నేపథ్యంలో సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందొ చూద్దాం.
ఫస్ట్ హాఫ్ అదిరింది
శ్రీనువైట్ల మార్క్ కామెడీతో ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండ్ హాఫ్ కూడా చాలా బావుంది. తప్పక చూడాల్సిన చిత్రం.
చాలా కాలం తరువాత
చలా కాలం తరువాత రవితేజ చిత్రానికి యూఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
అవసరమైన హిట్ పడింది
శ్రీనువైట్లకు అవసరమైన హిట్ పడింది. రవితేజ కామెడీ, ఇలియానా ప్రజెన్స్, తమన్ సంగీతం ఈ చిత్రంలో ఆకర్షణగా నిలిచే అంశాలు.
రొటీన్ స్క్రీన్ ప్లే
సినిమా యావరేజ్ గా ఉంది. శ్రీనువైట్ల మరోమారు పాతపంతా లోనే స్క్రీన్ నడిపించాడు.
బ్లాక్ బస్టర్ అంటూ
యూఎస్ నుంచి సినిమా బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వస్తోంది. శ్రీనువైట్ల, రవితేజ అదరగొట్టేసినట్లు ఉన్నారు.
డీసెంట్ టాక్
అమర్ అక్బర్ ఆంటోని ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందంటూ టాక్ వస్తోంది.
బి, సి సెంటర్స్‌లో పక్కా
అమర్ అక్బర్ ఆంటోని చిత్రం బి, సి సెంటర్స్ లో హిట్టు కొట్టడం పక్కా.
ఐదేళ్ల తరువాత
ఐదేళ్ల తరువాత ఇలియానాని బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నా. చాలా ఆసక్తిగా ఉంది.
కారణాలు ఇవే
చాలా కాలం తరువాత ఓ చిత్రం కోసం ఇంతగా ఎగ్జైట్ అవుతున్నా. శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్, ఇలియానా రీఎంట్రీ, సునీల్ నటిస్తుండడం లాంటి విషయాలే కారణాలు.
సినిమా బాగలేదంటూ
సినిమా బాగలేదంటూ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. శ్రీనువైట్లకు హార్డ్ టైం కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











