అమర్ అక్బర్ ఆంథోని రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. ప్రీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 10న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత జతకట్టిన రవితేజ, ఇలియానా చిత్రం నవంబర్ 16న రిలీజ్ కానున్నది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. దీపావళిని పురస్కరించుకొని ఈ చిత్రంలోని రెండోపాటను నవంబర్ 6న రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

తమన్ సంగీతం అందిస్తున్న అమర్ అక్బర్ ఆంథోని చిత్రంలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, తరుణ్ అరోరా తదితరులు నటిస్తున్నారు.
నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, వెన్నెల కిషోర్, రవి ప్రకాశ్, తరుణ్ అరోరా తదితరులు
స్క్రీన్ ప్లే: డైలాగ్స్, డైరెక్షన్: శ్రీను వైట్ల
కథ: శ్రీను వైట్ల, రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ చెరుకూరి
సినిమాటోగ్రఫి: వెంకట్ సీ దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్: ఎంఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్


Click it and Unblock the Notifications











