వారికోసం జయప్రద...ఒసేయ్ రాములమ్మ!?

By Srikanya

విజయశాంతి హీరోయిన్ గా దాసరి రూపొందించిన ఒసేయ్ రాములమ్మ ఎంత హిట్ అయిందో తెలిసందే. ఇప్పుడు జయప్రద అదే తరహా పాత్రలో 'శేష్ సంగత్' అనే బెంగాళి చిత్రంలో కనిపించనుంది.సినిమాల చైతన్యం తేవచ్చునని నమ్మిన ఆమె తమ పార్టీ నేత అమర్ సింగ్ తో కలిసి చేస్తోంది. తో రెడీ వుతున్న ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ దర్శకుడు అశోక్ విశ్వనాథ్ డైరక్ట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో మావోయిస్టులకూ, ప్రభుత్వానికి మధ్య పోరు జరుగుతున్ననేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రాన్ని జయప్రద నిర్మిస్తూ రాజి అనే గిరిజన యువతి పాత్రను పోషిస్తోంది. అణచివేతకు గురవుతున్న ప్రజల పట్ల సానుభూతి చూపించే రాజకీయవేత్త పాత్రను అమర్ సింగ్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బెంగాల్-జార్ఘాండ్ సరిహద్దుకు వృత్తిరీత్యా వెళ్లే పోలీస్ ఆఫీసర్ పాత్రను జాకీ షరాఫ్ పోషిస్తున్నారు.

ఇక ఈ కథలో అవమానాలకు, వేధింపులకు గురైన రాజీ(జయప్రధ) తీవ్రవాద గ్రూపులో చేరుతుంది. ఈ విషయాన్నే మీడియా మీట్ లో చెబుతూ 'పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రతి చోట అణచివేతకు గురవుతున్నారు. వారికి న్యాయం అందని ద్రాక్షే అవుతోంది. నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితిని నేను స్వయంగా చూశాను. అలాంటి బర్నింగ్ ప్లాబ్లంతోనే ఈ చిత్రం రూపొందుతోంది' అని జయప్రద చెప్తోంది.

2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లోని సుమారు 50 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. మెట్రో సిటీస్ లోనూ హిందీ సబ్ టైటిల్స్ తో డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు జయప్రద తెలిపారు. మొత్తానికి రాజకీయాల్లోకి వెళ్ళినా జయప్రద తన వృత్తిని మాత్రం మరవలేదన్నమాట. గుడ్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X