ఏక్ నిరంజన్ తో 'అమరావతి' దర్శనం

By Srikanya

ప్రభాస్, కంగనా రనౌత్ కాంబినేషన్ లో రేపు(గురువారం)వస్తున్న ఏక్ నిరంజన్ చిత్రంతో పాటు అమరావతి చిత్రం ట్రైలర్ ని ధియోటర్స్ లో ప్రదర్శించనున్నారు. పెద్ద సినిమాలతో పాటు ట్రైలర్స్ రిలీజ్ చేస్తే చాలామంది చూసే అవకాశం ఉంటుందని దర్శక, నిర్మాతలు ఈ పద్దతిని అనుసరస్తున్నారు. ఇంతకాలం బాలీవుడ్ లో పెద్ద సినిమాతో పాటు రెండు మూడు రాబోయో చిత్రాల ట్రైలర్స్ వచ్చేవి. తాజాగా తెలుగులో రెచ్చిపో, ఈనాడు చిత్రాలకు ఈ పద్దతిని అనుసరించారు. ఇక అమరావతి చిత్రాన్ని అల్లరి రవిబాబు దర్శకత్వంలో వస్తోంది. భూమిక, స్నేహ, సింధూర గద్దె ప్రధానపాత్రల్లో చేస్తున్న ఈ చిత్రంలో తారకరత్న నెగిటివ్ పాత్రల్లో కనిపిస్తాడు. ఇదో ధ్రిల్లర్ చిత్రం.ఇక అనసూయ, నచ్చావులే అనంతరం రవిబాబుకి మంచి క్రేజ్ వచ్చింది..అయితే ఈ అమరావతి చిత్రాన్ని ఏ హంగామా లేకుండా ప్రారంభించారు. ప్రెస్ కి చిన్న న్యూస్ గానీ, ఫోటో గానీ ఇవ్వలేదు. అయితే ఒక్కసారిగా ట్రైలర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అమరావతి చిత్రం నవంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X