నిన్న మంచు లక్ష్మి..ఇప్పుడు ముమైత్ ఆడుకుంటుంది
నిన్నటి వరకు మంచు లక్ష్మి ఆడుకుంది, నేటి నుంచి ముమైత్ ఖాన్ ఆడుకోనుంది. ఇంతకీ దేనితో.. అనుకుంటున్నారా? వీడియో గేమ్‌తో. మంచు లక్ష్మి నిర్మిస్తున్న 'గుండెల్లో గోదారి' చిత్రంలో మమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఇటీవల రాజమండ్రి సమీపంలో ఈ సాంగును చిత్రీకరించారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన పిఎస్3 (ప్లే స్టేషన్3)ను ముమైత్‌కి గిఫ్టుగా ఇచ్చింది. ఈ విషయాన్ని ముమైత్ ఖాన్ తన ట్విట్టర్ ద్వారా సయంగా వెల్లడిచింది. 'మంచు లక్ష్మి తనకు అమేజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. పిఎస్3 చాలా బాగుంది, మంచు లక్ష్మిది చాలా మంచి మనసు, ఆమె ప్రాజెక్టులో భాగస్వామిని కావడం..ఎంతో సంతోషంగా ఉంది' అంటూ ముమైత్ పేర్కొంది.
గుండెల్లో గోదారి సినిమాకు కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో సెక్సీ గర్ల్ తాప్సీ తోపాటు, ఆది పనిశెట్టి కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో ఈ చిత్రం చిత్తీకరణ జరుపుతున్నారు. పాలాని కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మురళి కృష్ణ ఆర్ట్ డైరెక్టర్. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. మే నెల కల్లా సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











