For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘సైరా’ విషయంలో పొరపాటు.. షాకైన ఫ్యాన్స్.. వివరణ ఇచ్చిన ప్రముఖ సంస్థ.!

  By Manoj
  |

  మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా పేరొందిన నటుడు. ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే చిరంజీవిని అప్పట్లోనే సుప్రీమ్ హీరో అనేవారు. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్న ఈ స్టార్ హీరో.. రెండు సంవత్సరాల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. 'ఖైదీ నెంబర్ 150'తో తన కమ్ బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాని తర్వాత 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. తాజాగా 'సైరా' విషయంలో జరిగిన ఓ పొరపాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

  సైరాకు ఊహించని స్పందన

  సైరాకు ఊహించని స్పందన

  తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. కానీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది. ఒక్క తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో ‘సైరా' అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

  లాభాలు వచ్చాయా.? నష్టాలు వచ్చాయా.?

  లాభాలు వచ్చాయా.? నష్టాలు వచ్చాయా.?

  ‘సైరా: నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. నైజాం, ఏపీలో రూ.107.4 కోట్లు, కర్ణాటకలో రూ.27 కోట్లు, తమిళనాడులో రూ.7.6 కోట్లు, కేరళలో రూ.2.5 కోట్లు, మిగితా దేశాల్లో రూ.27.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.20 కోట్లు పలికింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. అయితే, ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.

  రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ ప్రచారం

  రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ ప్రచారం

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘సైరా'పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను థియేటర్లలో చూడని వారు.. సైరా డిజిటల్ మీడియా పార్టనర్ అయిన అమెజాన్‌లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో కొందరు ఈ సినిమా స్ట్రీమింగ్ నవంబర్ 15 నుంచి స్టార్ట్ అవుతుందని వార్తలు ప్రచారం చేశారు. అయితే, శుక్రవారం ఈ సినిమా రాకపోవడంతో అందరూ షాక్ అయిపోయారు.

  అమెజాన్ వివరణ

  అమెజాన్ వివరణ

  ‘సైరా' స్ట్రీమింగ్‌కు సంబంధించి అమెజాన్ సంస్థ కీలక ప్రకటన చేసినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ‘అమెజాన్‌లో సైరా స్ట్రీమింగ్ ఉంటుందని కొందరు ప్రచారం చేశారు. కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. స్ట్రీమింగ్ త్వరలోనే ఉంటుంది. ఆ తేదీని కూడా కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం' అని ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

  సైరా: నరసింహారెడ్డి గురించి

  సైరా: నరసింహారెడ్డి గురించి

  స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించాడు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు.

  English summary
  Megastar Chiranjeevi is giving his everything to promote his dream project, Sye Raa Narasimha Reddy, even after three weeks since it released. The actor has been meeting top politicians requesting them to watch the film and get acquainted with the history.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X