For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్: చిరంజీవికి దెబ్బేసిన బడా సంస్థ.. ‘సైరా’ పూర్ రిజల్ట్‌కు అసలు కారణం ఇదే.!

  By Manoj
  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్నేళ్లు రాజకీయాల్లో బిజీగా గడిపినప్పటికీ.. ఆ తర్వాత మరోసారి సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. కమ్‌ బ్యాక్ మూవీతోనే ఆయన సత్తా చాటారు. ఎన్నో అంచనాలతో వచ్చిన చిరు మూవీ 'ఖైదీ నెంబర్ 150' సూపర్ హిట్ అవడంతో పాటు కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమా చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే....

  ఏదో అనుకుంటే ఇంకోదే అయిపోయింది

  ఏదో అనుకుంటే ఇంకోదే అయిపోయింది

  మెగాస్టార్ చిరంజీవి.. సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మించాడు. ఇందులో ఎంతో మంది ఫేమస్ యాక్టర్లు నటించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది.

  కలెక్షన్లు వచ్చినా నష్టాలు తప్పలేదు

  కలెక్షన్లు వచ్చినా నష్టాలు తప్పలేదు

  ఎన్నో అంచనాల నడుమ పలు భాషల్లో విడుదలైన ‘సైరా' కలెక్షన్ల పరంగా భారీ నష్టాలనే మిగిల్చిందని ప్రచారం జరిగింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదు చేసుకుంది. అయితే, ఈ మూవీ క్లోజింగ్ బిజినెస్ రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.

  అక్కడ సూపర్ హిట్ అయిన సైరా

  అక్కడ సూపర్ హిట్ అయిన సైరా

  మెగాస్టార్ సినిమానే అయినా.. థియేటర్‌లో ‘సైరా'ను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. కానీ, డిజిటల్ మీడియా దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. చాలా మంది ఈ సినిమాను క్లిక్ చేశారని తెలిసింది. ఈ సినిమాను అమెజాన్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని సమాచారం.

  చిరు రికార్డు.. ఏకైక హీరోగా ఘనత

  చిరు రికార్డు.. ఏకైక హీరోగా ఘనత

  ఇదే సినిమా తమిళంలోనూ రూపొందిన విషయం తెలిసిందే. ఇటీవల ‘సైరా: నరసింహారెడ్డి' తమిళ వెర్షన్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. దీనికి భారీ స్థాయిలో 15.4 టీఆర్పీ వచ్చింది. గతంలో ఏ తెలుగు హీరో సినిమాకూ ఇంత రేటింగ్ రాలేదు. దీంతో చిరు ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. బాహుబలి కూడా దీని దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.

  MAA Controversy : Chiranjeevi and Rajashekar spar at MAA Dairy 2020 Launch
  చిరంజీవికి దెబ్బేసిన బడా సంస్థ

  చిరంజీవికి దెబ్బేసిన బడా సంస్థ

  ఇక, ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను సంక్రాంతి కానుకగా ప్రముఖ చానెల్‌లో టెలివిజన్ ప్రీమియర్‌గా వేశారు. దీనికి చాలా తక్కువగా రేటింగ్ నమోదైంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు 11.8 రేటింగ్ వచ్చింది. ఇది తమిళ వెర్షన్ కంటే తక్కువే. ఈ సినిమాకు తక్కువ రేటింగ్ రావడానికి అమెజాన్ ప్రైమ్ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  English summary
  Sye Raa Narasimha Reddy is a 2019 Indian Telugu-language epic action film directed by Surender Reddy and produced by Ram Charan under the Konidela Production Company banner. A work of fiction, the film is inspired by the life of Indian independence activist Uyyalawada Narasimha Reddy from the Rayalaseema region of Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X