భీమ్లా నాయక్ కు మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. దానికి ఒప్పుకుంటే డబుల్ ప్రాఫిట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాపై కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఇంకా భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుని ఉండేది. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కూడా కలెక్షన్స్ పై కొంత ప్రభావం చూపినట్లు చాలా క్లారిటీ గా అర్థమైంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మాత్రం మరొకసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో చాలా క్లారిటీ గా చూపించాడు. ఇక ఇప్పుడు రానా దగ్గుబాటి తో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా కూడా అంతకు మించి అనేలా హైప్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమాకు కొన్ని భారీ ఆఫర్స్ వస్తున్నాయి. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సముఖంగా లేకపోయినప్పటికీ కూడా కొన్ని ఓటీటీ సంస్థలు మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేలా ఆఫర్స్ అయితే ప్రకటిస్తున్నాయి.

మరో బాహుబలి అనేలా..
పవర్ స్టార్ పవన్కళ్యాణ్ రానా దగ్గుబాటి ఇద్దరు కూడా మంచి స్టార్ డమ్ ఉన్న హీరోలు. ఒక విధంగా ఈ సినిమా బాహుబలి కి ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో తప్పకుండా సినిమా మరో బాహుబలి అనేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ ను అందుకుంటుందని చాలా పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో కూడా భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా..
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు ఓటీటీ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్స్ మాత్రం కళ్ళు చెదిరేలా ఉన్నాయి. అయితే కొందరు వాటికి టెంప్ట్ అవుతున్నప్పటికీ మరికొందరు మాత్రం థియేటర్స్ లో విడుదల చేయాలని చాలా బలంగా నిర్ణయం తీసుకున్నారు. భీమ్లా నాయక్ నిర్మాతలు మాత్రం ఓటీటీలో విడుదల చేయడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని ఇప్పటికే పలుసార్లు క్లారిటీ ఇచ్చారు.

ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు
ఎలాగైనా ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే నిర్మాతలతో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక సంక్రాంతికి పోటీగా పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సర్కారు వారి పాట తో పాటు RRR రాధేశ్యామ్ వంటి సినిమాలు సంక్రాంతి పోటీ లో ఉన్నప్పటికీ భీమ్లా నాయక్ విడుదల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.
Recommended Video

భారీ ఓటీటీ ఆఫర్
ఇక ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ నుంచి ఇటీవల ఒక భారీ ఆఫర్ వచ్చినట్లు సమాచారం. సినిమా కోసం నిర్మాతలు దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇక అమెజాన్ అయితే ఈ సినిమాకు 150 కోట్ల వరకు ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా సరే ఇలాంటి ఆఫర్ వస్తే మాత్రం ఓటీటీ లోనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ భీమ్లా నాయక్ నిర్మాతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











