ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. వెంకటేష్ దృశ్యం 2 కూడా ఓటీటీలోనే.. ఎప్పటి నుంచి అంటే?
విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కి మరో షాకింగ్ న్యూస్ చెప్పారు నిర్మాత సురేష్ బాబు. వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం దృశ్యం 2 కూడా ఓటీటీలో విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. ఆ వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలు
సినిమా ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువగా సినిమాలు చేసే హీరోగా విక్టరీ వెంకటేష్ కు పేరుంది. ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆయన. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న వెంకటేష్ వరుస విజయాలను కూడా అందుకుంటున్నాడు. ముఖ్యంగా F2 తర్వాత ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పవచ్చు.

వెంకీమామతో హిట్
ఆ తర్వాత వెంకీమామ తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న ఆయన కేవలం సోలో హీరోగానే కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే లాగా ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు. అయితే అందులో ఎక్కువగా రీమేక్ సినిమాలు ఉండడం విశేషం.

నారప్ప ఓటీటీలో
వెంకటేష్ ఇటీవల చేసిన నారప్ప సినిమా ఆమెజాన్ ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ మూవీ అసురన్ కు రీమేక్ గా వచ్చింది. నిర్మాత సురేష్ బాబు మొదట థియేటర్స్ లో విడుదల చేయాలని ప్లాన్ చేసినా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా అలాగే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల విషయం ఇంకా కొలిక్కి రాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశాడు. మొత్తానికి ఆ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే తదుపరి సినిమా మాత్రం ఎలాగైనా థియేటర్లో ని విడుదల చేయాలని వెంకటేష్ చాలా బలంగా నిర్ణయించుకున్నా ఇప్పుడు ఆ ప్లాన్లు కూడా ఫెయిల్ అయ్యాయి.

అమెజాన్ ప్రైమ్ లో
తాజాగా మలయాళం మూవీ దృశ్యం 2 సినిమా తెలుగు రీమేక్ దృశ్యం 2నీ కూడా అమెజాన్ లోనే విడుదల చేస్తున్నారు. సినిమాను నవంబర్ 25న సినిమాను అమెజాన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. కేవలం 50 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేశారు. అయితే నారప్ప సినిమా వరకే ఇలా జరిగిందని తదుపరి సినిమా విషయంలో మరొకసారి ఇలా జరగదని వెంకీ అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఏపీ టికెట్ల విషయంలో ఎలాంటి క్లారిటీ రాకపోవడం వల్ల ఈ సినిమా కూడా ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
Recommended Video
బిజీ బిజీగా
మరోపక్క ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 2 ప్రాంఛైజ్ గా వస్తున్న F3 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా వెంకటేష్ గట్టి నమ్మకంతో ఉన్నారనే చెప్పాలి. ఇక F3 సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నా సంగతి తెలిసిందే. వీలైనంత త్వరలో మరిన్ని సినిమాలని కూడా సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు వెంకటేష్.


Click it and Unblock the Notifications











