ఆసుపత్రి నుండి కన్నడ రెబల్ స్టార్ మెసేజ్

By Bojja Kumar

హైదరాబాద్: కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన రెబల్ స్టార్ అంబరీష్ ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై రకరకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో అంబరీష్ ఆసుపత్రి నుండి అభిమానులకు మెసేజ్ పంపారు. అందుకు సంబంధించిన వీడియో టేప్‌ను ఓ కన్నడ ఛానల్ ప్రసారం చేసింది.

ఈ వీడియో టేపులో అంబరీష్ మాట్లాడుతూ....అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తాను ప్రమాదం నుండి గట్టెక్కానని, కోలుకుంటున్నానని తెలిపారు. అదే విధంగా తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు జరిపిన అభిమానులకు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 Ambareesh's Message From Singapore

నేను ఎంతగానో ప్రేమిస్తున్న నా కర్నాటక రాష్ట్రానికి మరో పది రోజుల్లో తిరిగి వస్తానని అంబరీష్ ఆ వీడియో మెసేజ్‌లో తెలిపారు. ప్రస్తుతం తాను కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని, అదే విధంగా డాక్టర్ల సూచన మేరకు వ్యాయామాలు చేస్తున్నానని అంబి చెప్పుకొచ్చారు. అంబరీష్ తో పాటు ఆయన భార్య సుమలత, అభిషేక్ గౌడ సింగపూర్లో ఉన్నారు.

అంబరీష్‌ను చూడటానికి ఎవరూ సింగపూర్ రావొద్దని, త్వరలోనే ఆయన తిరిగి వస్తారని సుమలత తెలిపారు. తరచూ సందర్శకులు రావడం వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నారని సుమలత చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X