twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ హీరో అనారోగ్యం...కంగారు పడొద్దని ప్రకటన

    By Srikanya
    |

    Ambarish in hospital
    బెంగళూరు : తీవ్ర అస్వస్థతకు లోనైన సీనియర్‌ సినీనటుడు, గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌ కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మందుల ప్రభావం కారణంగా కొంత అపస్మారకంగా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు అంబి క్రమంగా కోలుకుంటున్నారని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన భార్య, సినీనటి సుమలత ప్రకటించారు. చికిత్సకు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. విషయం తెలిసిన వెంటనే పలువురు రాజకీయ నాయకులు, సినిమా నటులు ఆసుపత్రికి చేరుకుని అంబరీష్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

    ప్రస్తుతం అంబికి వెంటిలేటర్‌ ద్వారా కృత్రిమ శ్వాస.. ద్రవరూపంలో ఆహారాన్ని అందిస్తున్నారు. మరో 48 గంటల్లో డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉందన్నారు. సోమవారం వరకు వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స చేస్తామని వైద్యుడు సతీష్‌ తెలిపారు. ముందుజాగ్రత్తగానే ఇలా చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్‌ కారణంగా శుక్రవారం రాత్రి 8.45 గంటల సమయంలో అంబరీష్‌ ఇక్కడి విక్రమ్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

    కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఆయన అంబరీష్‌ చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ''అంబరీష్‌ అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉందని వైద్యులు చెప్పారు. రెండ్రోజుల్లో తేరుకుంటారు'' అని వెల్లడించారు. శనివారం ఉదయాన్నే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రిని సందర్శించారు. తాను వెళ్లినప్పుడు నిద్రిస్తున్నందున మాట్లాడేందుకు వీలుకాలేదని అన్నారు. క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు.

    అంబరీష్‌ అనారోగ్యానికి గురైన సమాచారం దావాలనంలా వ్యాపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది అభిమానులు బెంగళూరుకు తరలివచ్చారు. ఆరోగ్యశాఖ మంత్రి యు.టి.ఖాదర్‌, మండ్య ఎమ్పీ రమ్య, సీనియర్‌ నాయకుడు ఎం.సి.నాణయ్య, చిత్రపరిశ్రమకు చెందిన హెచ్‌.డి.గంగరాజు, రాక్‌లైన్‌ వెంకటేష్‌ తదితరులు శుక్రవారం రాత్రే ఆసుపత్రికి వెళ్లి ఆరా తీశారు. లోనికి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో కార్డియాక్‌ కేర్‌ యూనిట్‌ (సిసియూ) వెలుపలి నుంచే అంబరీష్‌ను చూసి వెనుతిరగాల్సి వచ్చింది. ప్రముఖ నటులు రవిచంద్రన్‌, శివరాజ్‌కుమార్‌, సీనియర్‌ నటి లీలావతి, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ఆసుపత్రిని సందర్శించారు.

    English summary
    Minister for Housing and veteran Kannada actor M H Ambarish was admitted to a private hospital in Bangalore on Friday night after complaining of uneasiness in the chest, reports DHNS.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X