బ్లాక్ మనీ వైట్‌గా.. చంద్రబాబు ప్యాకేజ్ పవన్‌కు అలా.. బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పై అంబటి రాంబాబు ఆరోపణలు

బ్రో ది అవతార్ సినిమాలో శ్యాంబాబు పాత్ర వివాదం నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం అంటే ఆగస్టు 1వ తేదీన మీడియాతో మాట్లాడుతూ బ్రో సినిమాపై, నిర్మాత విశ్వ ప్రసాద్, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..

బ్రో ది అవతార్ సినిమాలో పనిచేసిన పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ నాకు తెలిసిన ప్రకారం 50 కోట్లు. టోటల్‌గా పవన్ కల్యాణ్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్‌ కూడా రానటువంటి పరిస్థితుల్లో బ్రో సినిమా ప్రదర్శించబడుతున్నది. కారణం దృష్టి సరిగా లేదు. శత్రువులను ఇందులో ఇమడ్చి శునకానందం పొందడం ఓ కారణం అని అంబటి విమర్శల వర్షం కురిపించారు.

Ambati Rambabu serious allegations on Pawan Kalyans Bro The Avatar Producer TG Vishwa Prasad

పవన్ కల్యాణ్ 23 రోజులు పనిచేసి 66 కోట్లు తీసుకొన్నారా? లేదా 80 కోట్లు తీసుకొన్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. తీసుకొన్న రెమ్యునరేషన్‌కు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారా? అనేది చూపించాలి. నీతి, నిజాయితీపరుడుగా చెప్పుకొనే పవన్ కల్యాణ్.. నిజాలు బయటపెట్టాలి అని అంబటి డిమాండ్ చేశారు.

నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నల్ల డబ్బును వైట్ మనీగా మార్చి పవన్ కల్యాణ్ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఇది కుట్రపూరితమైన పరిస్థితులు కల్పిస్తున్నాయి అని ప్రజలకు విన్నవించుకొంటున్నాను అని అంబటి అన్నారు. పవన్ కల్యాణ్‌తో విశ్వ ప్రసాద్ తీసే సినిమాల వెనుక భారీ స్కామ్ ఉందని అంబటి రాంబాబు అన్నారు.

నిర్మాత విశ్వ ప్రసాద్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించాలి. పూర్తిగా పొలిటికల్ సినిమాలు తీస్తే పర్వాలేదు. కానీ సినిమా తీసి ఓ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోవద్దు. సక్సెస్ అయితే నాకు అభ్యంతరం లేదు. టీజీ విశ్వ ప్రసాద్‌కు అమెరికాలో, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు ముఠా డబ్బులు కలెక్ట్ చేసి విశ్వ ప్రసాద్‌‌కు ఇస్తే.. ఆయన పవన్ కల్యాణ్‌కు టీడీపీ ఇచ్చే ప్యాకేజీని సినిమాల రూపంలో అందజేస్తున్నారు అని అంబటి ఆరోపించారు.

చంద్రబాబు పంపించే డబ్బులను పవన్ కల్యాణ్‌కు ప్యాకేజ్ ఇవ్వడానికి విశ్వ ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నాడు. బ్లాక్ మనీని పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీగా ఇస్తున్నారు. ఇదోక పెద్ద స్కామ్. టీజీ విశ్వ ప్రసాద్ బ్లాక్ మనీతో భారీ సినిమాలు తీస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు, ప్రభుత్వ అధికారులు గమనించాల్సిన విషయం అని అంబటి రాంబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X