నేను బైసెక్సువల్ అని అందరికీ తెలిసి పోయింది: మీడియాపై నటి ఆగ్రహం
తన గురించి ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో తన జీవితం తలకిందులైందనట్లు అనిపించిందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ అన్నారు. తనపై బై సెక్సువల్ అని అందరికీ తెలిసిపోయిందని చెప్పింది.
Recommended Video

తన గురించి ఓ మేగజైన్‌లో వచ్చిన కథనంతో తన జీవితం తలకిందులైందనట్లు అనిపించిందని హాలీవుడ్ నటి అంబర్ హియర్డ్ అన్నారు.ఈ నెల 16న విడుదల కానున్న తన 'జస్టిస్ లీగ్' సినిమా ప్రమోషన్ లో ఆమె మాట్లాడుతూ, తనపై బై సెక్సువల్ అని ఆ మేగజీన్ లో కవర్ స్టోరీ రావడంతో విషయం అందరికీ తెలిసిపోయిందని చెప్పింది.

ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించారు
అలా కవర్ స్టోరీ రావటంతో జీవన విధానాన్ని అలాగే ఇంకా కొనసాగిస్తే మరిన్ని చిక్కులు తప్పవని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరించారని ఆమె తెలిపింది. లెస్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుందని ఆమె వాపోయింది. అప్పటినుంచి తన సినీ కెరీర్ నాశనమైందన్నారు.

అందరికీ తెలుసు
'నికోలస్ కేజ్, జానీ డెప్ సరసన నటించాను. ఆ సమయంలో నేనేలా ప్రవర్తించానో అందరికీ తెలుసు. కానీ కొందరు పనిగట్టుకుని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్బియన్-గే-బైసెక్సువల్-ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీ) వర్గాలపై చిన్నచూపుంది.తాను జానీ డెప్, నికోలస్ కేజ్ వంటి స్టార్స్ తో నటించానని, ఆ సమయంలో ఎలా ఉండేదానినో వారినడిగి తెలుసుకోవాలని ఆమె సూచించింది.

ఎల్జీబీటీలపై ఉన్న వివక్ష
కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత అభివృద్ధి చెందుతున్నా, సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నా..కొన్ని విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో చెప్పేందుకు ఎల్జీబీటీలపై ఉన్న వివక్షే నిదర్శనమని ఆమె తెలిపింది.

వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలి
మనుషులం అయినందుకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని' నటి అంబర్ హియర్డ్ అభిప్రాయపడ్డారు. నిజమే..! ఇలాంటి వ్యక్తి గంత అంశాలమీద ఎక్కువగా దృష్టి పెట్టిన మీడియా సెలబ్రిటీల జీవితాలని ఇబ్బందుల్లో పడేస్తూనే ఉంది. ఆమె లేటెస్ట్ మూవీ 'జస్టిస్ లీగ్' ఈ 16న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











