హవ్వ!! ఆమె... ఈమె పెదాలను ముద్దాడింది!
లాస్ఏంజిల్స్: ఆడ-మగ మధ్య ముద్దు ముచ్చట్లు జరిగితే రొమాన్స్ అంటారు....అదే ఆడ-ఆడ మధ్య ముద్దు పెట్టుకోవడాలు లాంటివి జరిగితే తేడా అంటారు. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి తేడా మనుషులు రోజు రోజుకు పెరిపోతున్నారు. ఇలాంటి వారిలో సెలబ్రిటీలు సైతం ఉండటం గమనార్హం.
ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో ఉండే వ్యక్తులనే ఈ ప్రపంచం గుర్తిస్తుంది. ముఖ్యంగా హాలీవుడ్ మూవీ ప్రపంచంలో ఇలాంటి పోకడలను మనం స్పష్టంగా గమనించవచ్చు. అక్కడి సెలబ్రిటీల వారి వారి సినిమాలు, ఇతర కార్యక్రమాలు, పార్టీలు, ఫంక్షన్లు లాంటి వార్తలతో వార్తల్లో ఉంటారు. అలాంటివేమీ లేని వారు ఎఫైర్లు, ప్రేమ కలాపాలు, కామ కలాపాలతో వార్తల్లో ఉండటానికి ప్రయత్నిస్తారు. మరికొందరేమో హాట్ అండ్ సెక్సీగా అందాల ఆరబోతకు దిగి మీడియాను ఆకర్షిస్తారు.

ఇవన్నీ అయిపోయాక రొటీన్ కి భిన్నంగా ఏదైనా చేయాలని వెంపర్లాడుతుంటారు. తాజాగా ఎంటీవీ మూవీ అవార్డ్స్-2015 సందర్భంగా ఈ షో వ్యాఖ్యాత అమీ షూమర్, హాలీవుడ్ సెలబ్రిటీ అంబర్ రోజ్ ఒకరి పెదాలను ఒకరు ఘాటుగా ముద్దాడి వార్తల్లోకి ఎక్కారు. అంత మంది ముందు ఎలాంటి మొహమాటం లేకుండా తమ పని కానిచ్చేసారు.
వీరి ముద్దు వ్యవహారం తర్వాత మీడియాలో వివిధ రకాల ప్రకారం జరుగుతోంది. ఇద్దరి మధ్య ఏదైనా తేడా వ్యవహారం నడుస్తోందా? లేక ఇద్దరూ కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా చేయాసారా? అనేది హాట్ టాపిక్ అయింది. కారణం ఏదైతేనేం....ఇద్దరూ ప్రపంచం దృష్టిలో పడ్డారు.


Click it and Unblock the Notifications











