twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    jr NTR రూమ్ లో పెట్టి అతన్ని మూడు రోజులు కొట్టాడు.. చిరుతో అలా మల్టీస్టారర్ క్యాన్సిల్: ఆంధ్రవాలా నిర్మాత

    |

    జూనియర్ ఎన్టీఆర్ ఒక వ్యక్తిని ఒక గదిలో మూడు రోజులు కొట్టినట్లుగా ఇటీవల ఆంధ్రావాలా నిర్మాత ఆవుల గిరి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అతనితోపాటు ప్రముఖ రాజకీయ నాయకుడు కొడాలి నాని కూడా ఆ వ్యక్తిని కొట్టినట్లుగా వివరణ ఇచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అలా చేయడానికి ఒక కారణం ఉంది అని అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి తో జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమా అనుకోకుండా ఆగిపోయినట్లు నిర్మాత వివరణ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

    సై, ఆంద్రావాలా

    సై, ఆంద్రావాలా

    జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా సినిమా నిర్మించిన ఆవుల గిరి ఆ సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత రాజమౌళి సై అనే సినిమాను కూడా నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో 20 ఏళ్ల క్రితం వరుసగా సినిమాలు నిర్మించడమే కాకుండా కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. దాదాపు అందరు హీరోలతో కూడా ఆయనకు మంచి స్నేహం ఉండేది. ఇక ఆయన 20 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం గా ఉంటున్నారు.

    Jr ఎన్టీఆర్, చిరుతో మల్టీస్టారర్

    Jr ఎన్టీఆర్, చిరుతో మల్టీస్టారర్

    ఇటీవల ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరి గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా నిర్మించిన ఆ తర్వాత మరో సినిమా కూడా నిర్మించాలని అనుకున్నాడట. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మల్టీస్టారర్ సినిమా చేయాలని కొన్ని రోజులపాటు చర్చలు కూడా జరిపారు. కానీ ఆ సినిమా ఆ ప్రాజెక్టు చర్చల దశలోనే ఆగిపోయిందట.

    ఎన్టీఆర్ తో అనుబంధం

    ఎన్టీఆర్ తో అనుబంధం

    అంతే అంతేకాకుండా తనకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా మధ్యలో మరొక వ్యక్తి గ్యాప్ సృష్టించినట్లు తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆవుల గిరి మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ కు కూడా ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. నేను ఎప్పుడూ అతని నాన్న అని పిలుస్తూ ఉండేవాన్ని. ఎన్టీఆర్ కు నేను చాలా సార్లు హెల్ప్ అయ్యాను. అలాగే అతను కూడా మంచి హెల్ప్ చేశాడు.

    ఒక వ్యక్తి కారణంగా..

    ఒక వ్యక్తి కారణంగా..

    అయితే ఒక వ్యక్తి కారణంగా ఒక సారి మా ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు ఏర్పడ్డాయి. ఒక వ్యక్తిని కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పనిలో పెట్టాడు. అయితే అతని కారణంగా జూనియర్ ఎన్టీఆర్ నన్ను తప్పుగా అపార్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇక నేను కూడా ఆ విషయంలో ఎక్కువగా దూరంగా ఉండాల్సి వచ్చింది.. అని అన్నారు.

    ఎన్టీఆర్ మూడు రోజులు కొట్టారు

    ఎన్టీఆర్ మూడు రోజులు కొట్టారు

    ఒక రోజు జూనియర్ ఎన్టీఆర్ కు ఆ వ్యక్తి గురించి అసలు విషయం తెలిసింది. ఎన్టీఆర్ పేరు చెప్పి అతను సొమ్ము చేసుకుంటూ ఉండేవాడు. వెంటనే పొరపాటును తెలుసుకొని అతనిపై గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ కూడా మూడు రోజుల్లో ఆ వ్యక్తిని ఒక గదిలో ఉంచి కొట్టారు కూడా. ఇక నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి కూడా అతనిపై చేయి చేసుకున్నాడు అని గిరి తెలియజేశాడు.

    రాజమౌళితో రానా ప్రతాప్ స్టోరీ

    రాజమౌళితో రానా ప్రతాప్ స్టోరీ


    ఇక నిజం తెలుసుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నన్ను రాజమౌళి దగ్గరికి తీసుకువెళ్లి ఇలా ఒక పొరపాటు జరిగింది అని, అన్నయ్య తో నేను ఒక మంచి సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశాడు. తప్పకుండా చేద్దాం అని కూడా రాజమౌళి అప్పుడు మాట ఇచ్చాడు అయితే నేను రాణా ప్రతాప్ అనే సినిమా చేయాలని అనుకున్నాను. ఆ సినిమా కథలో జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తే బాగుంటుందని సురేంధర్ రెడ్డి ఐడియా కూడా ఇచ్చాడు. ఇక రాజమౌళి లాంటి వ్యక్తి ఆ సినిమాను డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ కు నేను చెప్పాను.. అని గిరి తెలియజేశారు.

    అలా క్యాన్సిల్ అయ్యింది..

    అలా క్యాన్సిల్ అయ్యింది..


    ఎన్టీఆర్ కూడా సరే అని అన్నాడు. ఇక చిరంజీవికి ఎన్టీఆర్ మధ్య కొంత డిస్టెన్స్ ఉండేది. అప్పట్లో కొందరి కారణంగా అపోహలు కూడా ఉన్నాయి. కానీ నేనే ఒకసారి చిరంజీవితో కలిసి మాట్లాడించాను. అప్పటి నుంచి వారి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది అని ఆవుల గిరి తెలియజేశాడు. అయితే నేను నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి వారి కలయికలో సినిమా నిర్మించేందుకు కొన్ని రోజులు ప్రయత్నించాము. కానీ ఆ తరువాత నేనే మల్లి బిజినెస్ కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని గిరి తెలియజేశారు

    English summary
    Amdhrawala producer avula giri about jr ntr issue
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X