twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె అతడైతే..!? పరుచూరి వెంకటేశ్వరరావు ఏం చేస్తారు??

    |

    ఇంటర్నేషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరోగా, కన్నడ భామ చిరాశ్రీ హీరోయిన్‌గా శ్రీ కనకదుర్గా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతిప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆమె.. అతడైతే'. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్టార్‌ రైటర్‌ పరుచూరి వెంకటేశ్వరరావు విడుదల చేశారు.

    ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''ఆమె అతడైతే' టైటిల్‌ చాలా డిఫరెంట్‌గా వుంది. డైరెక్టర్‌ సూర్యనారాయణ చెప్పిన కాన్సెప్ట్‌ చాలా బాగుంది. పోస్టర్స్‌ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా వున్నాయి. దర్శకుడు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని విన్నాను. టైటిల్‌ ఎంత క్యూరియాసిటీగా వుందో.. సినిమా కూడా అదేవిధంగా వుంటుందని ఆశిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలను తేవాలని కోరుకుంటూ దర్శకుడు సూర్యనారాయణకి మంచి బ్రేక్‌ అవ్వాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

    విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కుర్రాడి కథ:

    విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కుర్రాడి కథ:

    దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ - ''తెలుగు మీడియంలో డిగ్రీ చదువుకున్న ఒక విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ కుర్రాడు కలెక్టర్‌ కావాలని కలలు కన్న తన తండ్రి ఆశయాన్ని కొడుకు ఎలా నెరవేర్చాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాను.

    లక్ష్యాన్ని ఎలా సాధించాడు:

    లక్ష్యాన్ని ఎలా సాధించాడు:

    తన లక్ష్యం కోసం సిటీకి వచ్చిన ఆ కుర్రాడు, తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు? అనే డిఫరెంట్‌ పాయింట్‌తో ఫుల్‌లెంగ్త్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. డిఫరెంట్‌ టైటిల్‌తో కథకి యాప్ట్‌ అయ్యేవిధంగా ఈ సినిమా వుంటుంది. ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మా నిర్మాతలు మారుతీ ప్రసాద్‌, రాధాకృష్ణలు ఈ చిత్రాన్ని ఎంతో క్వాలిటీతో నిర్మించారు.

    క్లాసికల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరో:

    క్లాసికల్‌ డ్యాన్సర్‌ హనీష్‌ హీరో:

    క్లాసికల్‌ డ్యాన్సర్‌గా ఇంటర్నేషనల్‌ లెవల్‌లో గుర్తింపు పొందిన హనీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. హనీష్‌ ఫెంటాస్టిక్‌గా నటించాడు.

    చిరాశ్రీ :

    చిరాశ్రీ :

    కన్నడలో ఉపేంద్ర, సుదీప్‌ సరసన హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన చిరాశ్రీ మా చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    సుద్దాల అశోక్‌తేజ:

    సుద్దాల అశోక్‌తేజ:

    యశో కృష్ణ కథకి తగ్గట్లుగా మంచి మ్యూజిక్‌ని అందించాడు. సుద్దాల అశోక్‌తేజ ఎక్స్‌లెంట్‌గా పాటల్ని రాశారు. మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఎడిటింగ్‌ సూపర్‌. తప్పకుండా ఈ చిత్రం సక్సెస్‌ అయి దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    'ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌:

    'ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌:

    నిర్మాతలు ఎం.మారుతీప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ - ''ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో దర్శకుడు సూర్యనారాయణ ఈ చిత్రాన్ని రూపొందించాడు. రెగ్యులర్‌ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం వుంటుంది.

    ఫస్ట్‌లుక్‌:

    ఫస్ట్‌లుక్‌:

    పరుచూరి వెంకటేశ్వరరావుగారు మా చిత్రం ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేయడం మాకు చాలా ఆనందంగా వుంది. యశోకృష్ణ సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు.

    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో ఆడియో రిలీజ్‌ :

    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో ఆడియో రిలీజ్‌ :

    ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో ఆడియో రిలీజ్‌ చేసి అదే నెలాఖరులో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

    భానుచందర్‌, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు:

    భానుచందర్‌, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు:

    భానుచందర్‌, ఆలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: ఆరే. వెంకటేష్‌, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, సంగీతం: యశోకృష్ణ, కెమెరా: హను కాక, ప్రొడక్షన్‌ మేనేజర్‌: బి. నాగేశ్వరరావు, నిర్మాతలు: ఎం. మారుతీప్రసాద్‌, ఎన్‌.రాధాకృష్ణ కథ- స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: కె.సూర్యనారాయణ.

    English summary
    Writer actor Paruchuri Venkateshwara rao Realeasead "Ame Athadaithe" Telugu Movie first look
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X