twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాపీ కొట్టారంటూ కలర్స్ స్వాతి సినిమాపై నినాదం

    By Srikanya
    |

    కొచ్చిన్ : కలర్స్ స్వాతి ప్రధానపాత్రలో మళయాళంలో రూపొందుతున్న చిత్రం 'ఆమెన్‌'. ఈ చిత్రంలో కలర్స్ స్వాతి క్రైస్తవ అమ్మాయిగా కనిపించి అలరించనుంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు కాపీ రైట్ వివాదంలో ఇరుక్కుంది. మళయాళ రచయిత దేవసికుట్టి ఈ చిత్రం కథ తన నవల నుంచి దొంగిలించారంటూ మీడియాకు ఎక్కారు. ఈ విషయమై ఆయన కోర్టుకి వెళతానని అంటున్నారు. తాను మళయాళంలో రాసిన Altharapookkal నవలలో ప్లాట్ ..ఈ చిత్రం ప్లాట్ ఒకటే అంటున్నాడు.

    ఈ విషయమై వివాద రచయిత దేవసికుట్టి మాట్లాడుతూ.. "కొన్ని సంవత్సరాల క్రితం ..నిర్మాత ప్రదీప్ మీనన్ ఈ కథతో చిత్రం చేస్తానంటూ నన్ను కలిసారు. అయితే అప్పుడు కుదరలేదు. అయితే రీసెంట్ గా ఆయన నిర్మిస్తున్న చిత్రం కథ విని ఆశ్చర్యపోయాను. ఆ కథ మరేదు కాదు..నా నవల నుంచి తీసుకున్నదే. అలాగే నా కథ లోని చర్చ బ్యాక్ డ్రాప్,క్యారెక్టర్స్ అన్నీ తీసుకున్నారు. కేవలం క్లైమాక్స్ మాత్రమే మార్చారని తెలిసింది."

    ఇక ఈ చిత్రం స్క్రిప్టు రైటర్ రఫీక్ మాట్లాడుతూ...అమీన్ డైరక్టర్ లిజో కి మళయాళం చదవటం రాదు. ఆయన మళయాళ నవల చదివి కాపీకొట్టారంటే నమ్మను. నాకు ఆయన ఈ కాన్సెప్టుని మూడేళ్ళ క్రిందటే చెప్పారు. అప్పటినుంచి ఈ సబ్జెక్టుమీద వర్క్ చేస్తున్నాం. నాకు దేవసకుట్టి నవల గురించి ఇప్పుడే తెలిసిందే. అంతకుముందు విననుకూడా వినలేదు." అన్నారు. దేవసికుట్టి...నేను నా హక్కు కోసం పోరాడటంలో వెనదీయను..నేను మా లాయిర్ తో మాట్లాడుతున్నాను. తప్పనిసరిగా న్యాయస్ధానం న్యాయం చేస్తుందని భావిస్తున్నాను. నేను కాపీ రైట్స్ కోసం పోరాడతాను అన్నారు.

    దర్శకుడు లిజో ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం గురించి కలర్స్ స్వాతి మాట్లాడుతూ... 'సుబ్రమణ్యపురం' తర్వాత మలయాళంలో చాలా అవకాశాలు వచ్చాయి. భాష సమస్య కారణంగా అంగీకరించలేదు. 'ఆమెన్‌'లో నటించాలని దర్శకుడు లిజో పట్టుబట్టారు. కాదనలేకపోయా. అందులో క్రైస్తవ అమ్మాయిగా కనిపించడం కొత్తగా ఉంది అంది. ఈ చిత్రంలో ఆమె సింగర్ గా కనిపిస్తుంది. ఓ పురాతన చర్చిలో కథ జరుగుతుంది.

    ఇక తమిళంలో 'సుబ్రమణ్యపురం'లో కొంటె చూపులతో తమిళ ప్రేక్షకులను వశపరుచుకున్న స్వాతి అక్కడ సైతం మంచి ఆఫర్స్ నే సంపాదిస్తోంది. గ్రామీణ యువతిగా లంగా ఓణీతో అలరించిన అమ్మడికి అయితే ఆచితూచి అడుగులు వేస్తున్నా అంటోంది. ఈ విషయమై మాట్లాడుతూ... కోలీవుడ్‌లో 'సుబ్రమణ్యపురం' తరహాకథల కోసం ఎదురుచూస్తున్నా. పూర్తిగా అలాగే కాకుండా కాస్త భిన్నంగా, కొత్తగా ఉండాలి. ఇకపై మాలీవుడ్‌లో చేయాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని 'ఆమెన్‌' విడుదలైన తర్వాత తీసుకుంటానని చెప్పింది.

    ప్రస్తుతం మాలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిని వదులుకున్నట్లు సమాచారం. దీనిపై స్వాతి ముచ్చటిస్తూ..ఇప్పుడు కూడా చాలామంది దర్శకులు సంప్రదిస్తున్నారు. భాష ప్రధాన అడ్డంకిగా నిలుస్తోంది. తమిళం, తెలుగులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునంటున్నా అంది. ఇక ప్రస్తుతం తెలుగులో కలర్స్ స్వాతి చేస్తున్న చిత్రం 'స్వామి రారా'. లవ్ విత్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందిస్తున్నారు.

    English summary
    Writer Devasikutty claims that the makers of the film have copied its plot from his novel, Altharapookkal
 Subramaniapuram-fame actress Swati Reddy's M-Town debut, Amen, has been accused of copying its plot from writer Devasikutty's novel, Altharapookkal. The writer claims that Amen shares a close similarity in its story and background with his Malayalam novel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X