Oscarsలో నాటు నాటుకు తారక్ చెర్రీ కాదు.. స్టెప్పులేసే ఆ అమ్మాయి ఎవరో తెలుసా ?

తెలుగు దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన కళాఖండం RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ మూవీపై యావత్ ప్రపంచమే ప్రశంసల వర్షం కురిపించింది. ఇంకా సినీ ప్రముఖులు, క్రిటిక్స్ కొనియాడుతున్నారు. ఈ క్రమంలో రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులు గెలుచుకుంటోంది.

ఇక నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఇదివరకే దక్కగా అకాడమీ అవార్డ్స్ 2023 నామినేషన్లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ కు స్టెప్పులేసే అమ్మాయి ఎవరు అనే అంశం ఆసక్తిగా మారింది.

 అవార్డులు గెలుచుకుంటూ..

అవార్డులు గెలుచుకుంటూ..

తెలుగు చిత్రీసీమలో దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలైంది. ఇప్పటికే అనేక అవార్డులు గెలుచుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది రౌద్ర రణం రుధిరం చిత్రం.

కీరవాణితో పాటు..

కీరవాణితో పాటు..

అవార్డులతో దూసుకుపోతున్న RRR సినిమాలోని నాటు నాటు పాట పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కు ఎంపికైంది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కీరవాణి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు. అయితే ఈ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటను ప్రదర్శించేందుకు కీరవాణితో పాటు చంద్రబోస్ కు కూడా ఆహ్వానం అందినట్లు ఇదివరకు వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్ క్లారిటీ..

ఎన్టీఆర్ క్లారిటీ..

ఆస్కార్ 2023 వేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితోపాటు గాయకులైన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు. వాళ్లతోపాటు హీరోలు డ్యాన్స్ చేస్తే ఇక అద్భుతమే కదా అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇటీవల హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్టేజీ మీద డ్యాన్స్ చేస్తారా అని అడిగితే అవకాశం ఉందన్నట్లుగా రామ్ చరణ్ తెలిపాడు. ఆ తర్వాత అలాంటి ఏం లేదని ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.

ఎవరా అమ్మాయి అని..

ఎవరా అమ్మాయి అని..

ఆస్కార్ వేడుకల్లో డ్యాన్స్ చేసేందుకు రిహార్సల్స్ అవసరం అని, దానికి తగిన సమయం లేదని తారక్ చాలా క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు హీరోలతో నాటు నాటు పర్ఫామెన్స్ లేదని స్పష్టత వచ్చింది. అయితే మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న ఉదయం 5:30 గంటలకు) ఘనంగా జరగనున్న ఆస్కార్ 2023 అవార్డ్స్ వేడుకలో నాటు నాటు పాటకు ఒక అమ్మాయి స్టెప్పులు వేయనుంది. ఇప్పుడు ఆమె ఎవరా అనే ఆసక్తి నెలకొంది.

ఇండియాకు రిప్రజెంట్ గా..

ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుంది లారెన్ గాట్లీబ్ (Lauren Gottlieb). ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. "స్పెషల్ న్యూస్. నేను ఆస్కార్స్ లో నాటు నాటు పాటకు పర్ఫామెన్స్ చేస్తున్నా. ప్రపంచ ప్రఖ్యాతి వేదికపై భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఆశీర్వదించండి" అని అమెరికన్ నటి, డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ రాసుకొచ్చింది.

ప్రభుదేవా సినిమాలో..

అమెరికన్ నటి, డ్యాన్సర్ అయిన లారెన్ గాట్లీబ్ హిందీ చిత్రాల్లో నటించింది. హిందీ బుల్లితెరపై ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షో ఝలక్ దిఖ్లాజా సీజన్ 6లో రన్నరప్ గా నిలిచింది. అంతేకాకుండా 2013లో వచ్చిన ప్రభుదేవా 'ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్' సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. మరి ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు ఈ బ్యూటి ఎలా డ్యాన్స్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X