బాలకృష్ణ కూతురికి అవార్డు
హీరో బాలకృష్ణ కుమార్తె, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కోడలు బ్రహ్మణి కాలిఫోర్నియా శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి డిస్టింక్షన్ సాధించారు. ఈ డిగ్రీతో పాటు మూడు అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో హయ్యస్ట్ జి.పి.ఎ. అవార్డు, ఉత్తమ విద్యార్థికిచ్చే 'సమ్మా కమ్ లాడే' అవార్డు ఇంజనీరింగ్ విభాగంలో బ్రహ్మణికి లభించాయి.
అలాగే బ్రహ్మణి గ్రూప్ సబ్‌మిట్ చేసిన ప్రాజెక్ట్‌కి ప్రథమ బహుమతి లభించింది. బ్రహ్మణి డిగ్రీతోపాటు అవార్డులు అందుకున్న కార్యక్రమంలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కుటుంబాలు పాల్గొన్నాయి. ప్రతిభావంతురాలైన విద్యార్థిగా కాలిఫోర్నియా శాంటాక్లారా విశ్వవిద్యాలయం ప్రశంసలు అందుకున్న బ్రహ్మణిని ఈ సందర్భంగా వీరు అభినందించారు. ఈ సందర్భంగా కాలిఫోర్నియాని సందర్శించిన వారిలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, నారా లోకేష్, భువనేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి, బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని ఉన్నారు.


Click it and Unblock the Notifications











