ఆ ఇద్దరి వల్లే సమంత ఇలా ఉంటుందట.. ఎట్టకేలకుబ్రేక్‌పై సమంత రియాక్షన్..

హీరోయిన్ సమంత ఏడాది పాటు బ్రేక్ తీసుకోనున్నట్లు గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టింది. అది చూస్తుంటే బ్రేక్ గురించే ఆమె మాట్లాడినట్టు అనిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత: కెరీర్ లో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. ఆ మధ్యలో యశోదతో హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత శాకుతలంతో భారీ డిజాస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ అందాల తార.. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి, హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ చేస్తోంది. తాజాగా ఈ రెండు చిత్రీకరణలు పూర్తయ్యాయి.

Amidst acting one year break rumours, Samantha Ruth Prabhu wraps up shooting of Citadel Indian webseries.

అందుకేనా బ్రేక్: రీసెంట్ ఈ ముద్దుగుమ్మ ఖుషి, సిటాడెల్ షూటింగ్ లు పూర్తి చేశాక ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు విదేశాలకు వెళ్లబోతుందని అన్నారు. అప్పట్లో మయోసైటిస్ తో ఈ ముద్దుగుమ్మ బాధపడింది. ఇప్పుడా రోగాన్ని పూర్తిగా నయం చేసుకునేందుకు ఫారెన్ వెళ్లనుందట.

Amidst acting one year break rumours, Samantha Ruth Prabhu wraps up shooting of Citadel Indian webseries.

బ్రేక్ గురించేనా మాట్లాడింది: తాజాగా సమంత ఓ పోస్ట్ చేసింది. సిటాడెల్ వెబ్ సిరీస్ షూట్ పూర్తైనట్లు తెలిపింది. దర్శకులు రాజ్ అండ్ డీకే కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసింది. సిటాడెల్‌ ఇండియన్ వెర్షన్ షూటింగ్ పూర్తి చేశాను. ఫలితం ఏం రానుందో తెలియనప్పుడు బ్రేక్‌ అనేది చెడ్డ విషయంగా అనిపించదు. రాజ్‌ అండ్‌ డీకే నాకు ఫ్యామిలీతో సమానంగా భావిస్తాను.

ప్రతి ఒక్క సమస్యను ధైర్యంగా పోరాడేందుకు రాజ్ అండ్ డీకే నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ధన్యవాదాలు. ప్రపంచంలోని అన్నింటి కన్నా ఎక్కువగా మిమ్మల్ని గర్వపడేలా చేయాలని ఆశిస్తున్నాను. నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రను ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం మరో పాత్ర క్రియేట్ చేసే వరకు ఇదే నాకు బెస్ట్‌ అని సమంత రాసుకొచ్చింది.

వైరల్ గా పోస్ట్: సమంత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, అభిమానులు.. సమంత పెట్టిన పోస్ట్ బ్రేక్ గురించేనని మట్లాడుకుంటున్నారు. ఏదిఏమైనా సమంత ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. వీపరీతంగా లైక్స్, కామెంట్స్ పెడుతున్నారు. అలాగే ఇంకొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు.

Amidst acting one year break rumours, Samantha Ruth Prabhu wraps up shooting of Citadel Indian webseries.

ప్రమోషన్స్ లో పాల్గొంటుందా: ఇకపోతే సమంత నటించిన ఖుషి సినిమా సెప్టెంబరు 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. శివనిర్వాణ్ దర్శకత్వం వహించారు. ఇక సిటాడెల్ విషయానికొస్తే ఇది కూడా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అలా ఈ రెండు రిలీజ్ కు సిద్ధమవ్వడంతో పాటు ప్రమోషన్స్ కోసం రెడీ అయ్యాయి. మరి ఈ ప్రచారాల్లో సమంత పాల్గుంటుందో లేదో చూడాలి..

More from Filmibeat

Read more about: samantha citadel shooting webseries
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X