పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్య: ఆ హీరోయిన్లు ఆ టైపా?
ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.... కొందరు స్టార్స్ మాదిరి డర్టీ గేమ్స్, డర్టీ పాలిటిక్స్ అంటే నాకు నచ్చవు. ఇలాంటి వాటికి నేను ఎప్పుడూ దూరంగానే ఉంటాను. ఇతరుల్లా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి నేను ఏ హీరోతోనూ డేటింగ్ చేయలేదు. అలాంటి అలవాట్లు నాకు లేవు. సినిమా రంగం, యాడ్ ఫిల్మ్ రంగం ఇలా అనేక చోట్ల ఇలాంటి డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయని చెప్పుకొచ్చింది అమీషా. మరి ఆమె వ్యాఖ్యల్లోని అర్థం ఏమిటో మీకు ఇప్పటికే అర్థం అయి ఉంటుంది.
ఆమె సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే... ఆమె నటించిన రేస్-2 చిత్రం ఇప్పటికే విడుదలై విజయం దిశగా సాగుతుండగా, రన్ బోలా రన్, షార్ట్ కట్ రోమియో, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యూజిక్, పరదేశి స్ట్రీట్ సినిమాల్లో నటిస్తోంది. హిందీలో హృతిక్ రోషన్‌తో కహోనా ప్యార్ హై... ఆ వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్‌తో 'బద్రి' చిత్రాలు చేసి హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన అమీషా పటేల్ తెలుగులో మహేష్ తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, ఆ మధ్య బాలకృష్ణ తో పరమవీర చక్ర లోనూ నటించింది.


Click it and Unblock the Notifications












