బాలకృష్ణ 'పరమ వీర చక్ర' హీరోయిన్ కి అవమానం..
బాలకృష్ణ తాజా చిత్రం 'పరమవీరచక్ర' సినిమాలో నటిస్తున్న అమీషా పటేల్ కి రీసెంట్ గా కోల్ కతా విమానాశ్రయంలో ఇటీవల అవమానం ఎదురైంది. విమానాశ్రయ భద్రతాసిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఆమె మనస్తాపం చెందింది. భద్రతా తనిఖీకోసం వెళ్ళిన అమీషాకు, అక్కడి కౌంటర్‌లోని మహిళకు మధ్య వాదన జరిగిందని, అమీషా మర్యాదపూర్వకంగానే మాట్లాడినప్పటికీ భద్రతా ఉద్యోగి అయిన మహిళ అనుచితంగా వ్యవహరించిందని తెలుస్తోంది. తన బ్యాగ్‌ను ఉంచేందుకు ఒక ట్రే ఇవ్వాలని అమీషా కోరగా, ఆమె బ్యాగ్‌ను ఆ ఉద్యోగిని విసిరేసినట్టు భోగట్టా. తాను నవ్వుతూ, మర్యాదపూర్వకంగానే మాట్లాడానని, కాని ఆ ఉద్యోగిని సహనం కోల్పోయినట్టు ప్రవర్తించిందని అమీషా చెప్పింది. అనంతరం భద్రతా సిబ్బందికి పై అధికారి అయిన వ్యక్తివద్దకు వెళ్ళి, అమీషా ఫిర్యాదు చేయగా, ఎంతోసేపట్నుంచి విధులు నిర్వర్తిస్తున్నందున విసుగుతో ఆ ఉద్యోగిని అలా ప్రవర్తించినట్టు ఆ అధికారి చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు అమీషా చెప్పింది. బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందుతున్న 'పరమవీరచక్ర' సినిమాలో ప్రస్తుతం అమీషా నటిస్తోంది. ఇంతకు ముందు అమీషా తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన బద్రీ,మహేష్ బాబు సరసన నాని చిత్రాలలో నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











