బాలకృష్ణ హీరోయిన్ నిర్మాతగా మారి ఆ దర్శకుడుతోనే...
బాలకృష్ణ సరసన పరమవీరచక్ర చిత్రంలో నటించిన అమీషా పటేల్ త్వరలో నిర్మాతగా మారుతోంది. తన స్నేహితుడు కునాల్ గూమర్‌తో కలిసి 'అమీషా పటేల్ ప్రొడక్షన్స్" పేరిట ఓ బేనర్ ఆరంభించారామె. ఇటీవల బాలీవుడ్‌కి చెందిన కొంతమంది ప్రముఖుల సమక్షంలో ఈ బేనర్‌ని ప్రకటించి వైభవంగా పార్టీ కూడా ఇచ్చారు. తొలి ప్రయత్నంగా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు అమీషా. 2002లో ఆయన దర్శకత్వంలో 'యే హై జాల్వా" అనే చిత్రంలో నటించారామె. అప్పట్నుంచి డేవిడ్, అమీషా మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది. డేవిడ్ కూడా అమీషా నిర్మించే చిత్రానికి దర్శకత్వం వహించడానికి అంగీకరించారని సమాచారం.
నిర్మాతగా మారాలనుకున్నప్పుడు అమీషాను నిరుత్సాహపరిచినవారు ఉన్నారట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ''ఒక పని చేయాలనుకున్నప్పుడు ప్రోత్సహించేవాళ్లు, నిరుత్సాహపరిచేవాళ్లు ఉంటారు. వారి అభిప్రాయాన్ని తీసుకుని మన మనసుకి ఏది అనిపిస్తే అదే చేయాలి. హీరోయిన్ గా దాదాపు 50 చిత్రాల్లో నటించిన అనుభవం నాకుంది. ఆ అనుభవంతో మంచి సినిమా తీయగలననే నమ్మకం ఉంది. కాబట్టి ఎంతమంది నిరుత్సాహపరిచినా పట్టించుకోలేదు. నటిగా నా ప్రతిభ నిరూపించుకున్నా. నిర్మాతగా కూడా నా సత్తా ఏంటో చూపిస్తా అంటోంది.


Click it and Unblock the Notifications











