For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీగా సెగలు రేపుతున్న పవన్ హీరోయిన్...(ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్....తొలి సినిమాతోనే హిట్ కొట్టింది. ఆ సినిమాలో అమీషా అందంగా, అమాయకంగా చేసిన సరయూ పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అమీషాపటేల్ అంటేనే గ్లామర్‌కు పర్యాయ పదంగా నిలిచిన అనేక చిత్రాలు మనకు తెలుసు. మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరాలేదు.

  బాలీవుడ్ లోనూ అమీషా పటేల్ ఓ మోస్తరు హీరోయిన్ గానే రాణించింది. 2009, 2010 సంవత్సరాల్లో అసలు సినిమాలే చేయని అమీషాకి తర్వాత తెలుగులో పరమ వీర చక్ర, మరో హిందీ సినిమా అవకాశం వచ్చినా పెద్దగా లాభం లేక పోయింది. అయితే అమ్మడు చేతిలో ప్రస్తుతం చాలా ప్రాజెక్టులే ఉన్నాయి. ఆమె నటించిన రేస్-2 చిత్రం ఇప్పటికే విడుదలై విజయం దిశగా సాగుతుండగా, రన్ బోలా రన్, షార్ట్ కట్ రోమియో, భయ్యాజీ సూపర్ హిట్, దేశి మ్యూజిక్, పరదేశి స్ట్రీట్ సినిమాల్లో నటిస్తోంది.

  ఇతర వివరాల్లోకి వెళితే...అమీషా పటేల్, బాలీవుడ్ దర్శకుడు విక్రమ భట్ మధ్య ఆ మధ్య రంజైన ప్రేమాయనం సాగిన విషయం తెలిసిందే. కొంత కాలం పాటు ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేసారు. ఆ మధ్య వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రబలంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే విక్రమ్ భట్ మాత్రం ఈవార్తను ఖండించారు. మేము ప్రేమించుకున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె గతంలో వాళ్ల పేరెంట్స్‌తో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు నన్నొక మంచి స్నేహితుడిగా భావించి నా వద్ద ఆశ్రయం పొందింది. కష్టాల్లో ఉన్న ఆమెకు ఓదార్పును మాత్రమే పంచాను. అంతుకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని తేల్చి చెప్పాడు.

  హిందీలో హృతిక్ రోషన్‌తో కహోనా ప్యార్ హై చిత్రంతో అమీషా సినీ రంగం ప్రవేశం చేసింది.

  ఆమె చేసిన రెండో సినిమా తెలుగులో పవన్ తో చేసిన బద్రి

  బద్రి తర్వాత అమీషా పటేల్ తెలుగులో మహేష్ తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, ఆ మధ్య బాలకృష్ణ తో పరమవీర చక్ర లోనూ నటించింది.

  మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరాలేదు.

  ప్రస్తుతం ఆమె నటించిన రేస్ 2 చిత్రం థియేటర్లలో ప్రసారం అవుతోంది.

  37 ఏళ్ల వయసున్నఅమీషా ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్ తోపాటు, డబ్బు సంపాదించడంపైనే పెట్టింది.

  ఈ వయసులో హీరోయిన్ అవకాశాలు కష్టమేకాబట్టి సినిమాల్లో నటించే ఏ అవకాశం వచ్చినా నో అనకుండా ఒప్పేసుకుంటోంది.

  ఇటీవల ఓ కళ్ల జోళ్ల కంపెనీ ప్రచారం కోసం ఎంతో సెక్సీగా అందాలు ఆరబోసింది అమీషా.

  అమీషా పటేల్ హాట్ లుక్

  అమీషా పటేల్ హాట్ లుక్

  37 ఏళ్ల వయసున్నఅమీషా ప్రస్తుతం తన దృష్టంతా సినిమా కెరీర్ తోపాటు, డబ్బు సంపాదించడంపైనే పెట్టింది. ఈ వయసులో హీరోయిన్ అవకాశాలు కష్టమేకాబట్టి సినిమాల్లో నటించే ఏ అవకాశం వచ్చినా నో అనకుండా ఒప్పేసుకుంటోంది. అదే విధంగా వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తోంది. ఇటీవల ఓ కళ్ల జోళ్ల కంపెనీ ప్రచారం కోసం ఎంతో సెక్సీగా అందాలు ఆరబోసింది అమీషా. ఈ వయసులో ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదనడానికి నిరూపించుకుంది. అమీషా సెక్సీ హాట్ లుక్ ఫోటులు స్లైడ్ షోలో వీక్షించండి

  English summary
  
 Amisha Patel hot Photo shoot : Bollywood beauty Ameesha Patel looking ultra-glamorous and sizzling hot in the new advertisement for Glam Star sunglasses, a brand that she is endorsing.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X