అమీషాపటేల్..లేకుంటే ఆ రాత్రి చాలా ఇబ్బంది ఎదురయ్యేది అంటూ ఆమెను యూనిట్ వర్గాలు పొగడ్తల్లో ముంచేసారు. ఈ మధ్య ఆమె బాలీవుడ్ హీరో గోవిందాతో కలిపి రన్ బోలా రన్ అనే చిత్రానికి ఓ రాత్రంతా కలిసిపనిచేసింది. అయితే ఇందులో విశేషమేమిటంటే..రాత్రిళ్లు పనిచేయటానికి ఇష్టపడని గోవిందాని ఆమె ఒప్పించటం. రాత్రి ఎనిమిది అవ్వగానే గోవిందా ఎప్పటిలాగానే బయిలుదేరాడు. అయితే ఆ రోజు జరిగిన పాట షూటింగ్ పూర్తి కాలేదు. తెల్లారితే అందరి డేట్స్ ఎడ్జెస్ట్ చేయటం చాలా కష్టం. ఆ విషయం తెలిసినా గోవిందా సారి చెప్పి బయిలుదేరారు. నిర్మాత, దర్శకుడు, కొరియాగ్రాఫర్ ఏం చేయాలో అర్ధం కాక చూస్తూండబోయారు. అప్పుడు ఈ తతంగం అంతా చూస్తున్న అమీషా రంగంలోకి దూకింది. వెళ్ళి ఒంటరిగా గోవిందాను కలిసింది. ఏం చెప్పిందో ఏమో కాస్సేపటికి గోవిందా వచ్చి రాత్రంతా షూటింగ్ పాల్గొని అప్పుడు ఇంటికి బయిలుదేరాడు. అదీ అమీషా ఎఫెక్టు..