నా 'పవర్' ఏంటో చూపిస్తానంటున్న బాలకృష్ణ హీరోయిన్
పవన్ కళ్యాణ్ తో బద్రి, మహేష్ తో నాని చిత్రాలు చేసిన అమీషా పటేల్ తాజాగా బాలకృష్ణ సరసన పరమవీర చక్ర చిత్రంలో చేస్తోంది. అయితే తాజాగా ఆమెకు బాలీవుడ్ నుండి ఓ భారీ ఆఫర్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ సంతోషి రూపొందిస్తున్న 'పవర్' చిత్రంలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది. భారీ బడ్జెట్ తో హేమా హేమీల్లాంటి నటుల (అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్)తో 'పవర్' చిత్రం రూపొందుతోంది. దాంతో అమీషా పటేల్ చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు బాలీవుడ్ నుంచి నిష్కమించాననుకున్న దశలో ఈ ఆఫర్ రావటం ఆమెకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ విషయాన్ని మీడియాకు చెప్తూ.."అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగన్ లాంటి మెగా హీరోలు నటిస్తుండటంతో 'పవర్' రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వారితో కలిసి నటించటంతో మన నటన తేలిపోతుందని అనుకుంటున్నాను! 'నేను ఏస్థాయిలో నటించాలి?' నా దర్శకుడికి చెడ్డ పేరు తీసుకురాకుండా చక్కగా నటిస్తానని అనుకుంటున్నాను. అలాగే నా నటనా పవర్ ఏమిటో చూపిస్తాను" అంది.


Click it and Unblock the Notifications











