ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఎక్స్ ఫోజింగ్ బాటలో పవన్ హీరోయిన్

By Bojja Kumar

ముంబై: అవకాశం కోసం ఎదురుచూడాలి, లేదంటే అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఈ ఫార్ములా, హీరోయిన్ అమీషా పటేల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. కొన్నాళ్ళ క్రితం వరకు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్ గా పేరున్న ఈమెకు ఓ ఐదేళ్లుగా ఎవరూ పట్టించుకోవడం మానేశారు.

హిందీలో హృతిక్ రోషన్‌తో కహోనా ప్యార్ హై...ఆ వెంటనే తెలుగులో పవన్ కళ్యాణ్‌తో 'బద్రి' చిత్రాలు చేసి హిట్ చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన అమీషా పటేల్ తెలుగులో మహేష్ తో నాని, జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు, ఆ మధ్య బాలకృష్ణ తో పరమవీర చక్ర లోనూ నటించింది. అయితే అవన్నీ ఫ్లాప్ అవ్వడంతో అమీషాను టాలీవుడ్ లో ఎవరూ పట్టించుకోలేదు.

అమీషాపటేల్ అంటేనే గ్లామర్‌కు పర్యాయ పదంగా నిలిచిన అనేక చిత్రాలు మనకు తెలుసు. మంచి నటిగా ప్రేక్షకుల మన్నన లు పొందినా, బాలీవుడ్‌లో మంచి మంచి అవకాశాలు వచ్చినా అమీషాకెందుకో కలిసిరాలేదు. ప్రస్తుతం అవకాశాలకోసం ఎదురుచూస్తూ ఎక్స్‌పోజింగ్‌కైనా సిద్ధమంటోంది.

ఈ వయసులో అలా చేస్తే ఎవరు చూస్తారని అడిగితే ఎక్స్‌పోజింగ్‌కి, గ్లామర్‌కు వయసుతో పనేంటి అని ప్రశ్నిస్తోంది. నా గ్లామర్ చూడండి. ఏమైనా వయసు దాటిపోయినట్లు కనిపిస్తోందా? వయసు పెరిగినా తన గ్లామర్‌కు ఎటువంటి డ్యామేజి రాలేదంటోంది. ఒక్క ఛాన్స్ దొరికితే నిజమైన ఎక్స్‌పోజింగ్ ఏంటో చూపిస్తానంటోంది. పాపం. ఎవరో ఒకరు అవకాశం ఇవ్వమని కోరుతున్న అమీషాను చూస్తే జాలేస్తోంది కదా!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X